News January 12, 2026

జనగామ: ‘మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి’

image

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్రీదేవితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో ఫొటో ఓటరు జాబితా ప్రకటన, పోలింగ్ కేంద్రాల జాబితా ప్రకటన అంశాలపై రివ్యూ నిర్వహించారు.

Similar News

News January 31, 2026

ASF: రాబందుల మకాం మార్పు.. మహారాష్ట్ర వైపు చూపు!

image

అరుదైన ఇండియన్ వల్చర్స్(రాబందులు) MHకు వలస వెళ్లాయి. ASF జిల్లా పెంచికల్పేటలోని పాలరాపు గుట్టల వద్ద అటవీ అధికారులు చేపట్టిన సంరక్షణ చర్యల వల్ల వీటి సంఖ్య పెరిగింది. అయినప్పటికీ అదనపు ఆహారం కోసం గడ్చిరోలి(D) కమలాపూర్ పక్షుల కేంద్రానికి తరలిపోయాయి. గతంలో ‘డిక్లోఫెనాక్’ ప్రభావంతో అంతరించిపోయే దశకు చేరిన ఈ పక్షులు, ప్రస్తుతం పాలరాపు గుట్టల్లో ఒకే జత మిగలడం పట్ల పక్షి ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు.

News January 31, 2026

MBNR: నేడు స్కూటీని.. అభ్యర్థుల్లో ఉత్కంఠ

image

మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగియడంతో శనివారం అధికారులు పత్రాల పరిశీలన చేపట్టారు. అసంపూర్తి సమాచారం, సాంకేతిక లోపాలు ఉంటే నామినేషన్లు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉండటంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. కాగా పాలమూరు కార్పొరేషన్‌కు 579, దేవరకద్ర 86, భూత్పూర్ 96 నామినేషన్లు రాగా, WNP జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు 812, NRPT 541, GDL 525, NGKL 521 నామినేషన్లు దాఖలయ్యాయి.

News January 31, 2026

ఇంద్రవెల్లి: దంపతుల గొడవ.. గొంతుకొసుకున్నాడు

image

ఇంద్రవెల్లి మండలంలోని హీరాపూర్ పుకెట్ నగర్‌కు చెందిన రామదాస్ శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దంపతుల మధ్య తలెత్తిన గొడవలతో మనస్తాపం చెందిన ఆయన ఆవేశంలో గొంతు కోసుకున్నారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం రిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం రామదాస్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు.