News January 12, 2026
నెల్లూరు ఎస్పీ గ్రీవెన్స్‌కి 105 అర్జీలు

నెల్లూరు పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఎస్పీ అజిత వేజెండ్ల బాధితుల నుంచి స్వయంగా అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 105 అర్జీలు వచ్చాయని తెలిపారు. వాటిలో ఎక్కువగా చీటింగ్ కేసులకు సంభందించి అర్జీలు వచ్చాయి. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. వచ్చిన ప్రతి అర్జీకి జవాబుదారీగా ఉండి సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించాలని అధికారులను కోరారు.
Similar News
News March 18, 2026
నెల్లూరు: దొంగల ముఠా అరెస్ట్

తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో 195 ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసిన దొంగలు పట్టుబడ్డారు. వారి నుంచి 400KGల రాగి, 2ఆటోలు, 2బైక్‌లు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి SP సుబ్బరాయుడు తెలిపారు. నిందితులు గూడూరు(M) గొల్లపల్లికి చెందిన బండి వాసు(22), బూదూరు మణి(27), కత్తి పోలయ్య(40), చందు(25), ఏకోలు మధు(32)గా గుర్తించారు. మనుబోలు(M) యాచవరానికి చెందిన చల్లా రాఘవ వాళ్ల నుంచి రాగి కొనడంతో అరెస్ట్ చేశారు.
News March 18, 2026
నెల్లూరు కలెక్టర్ కీలక ఆదేశాలు

కండలేరు, సోమశిల జలాశయాల భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేసి భూములను సంబంధిత శాఖకు అందించేలా చర్యలు తీసుకోవాలి నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా సంబధిత అధికారులకు సూచించారు. తన ఛాంబర్‌లో ఇంజినీర్లు, రెవెన్యూ అధికారులతో సమీక్ష చేశారు. ఆనం సంజీవయ్య బ్రాంచ్ కెనాల్, కేజీఎం బ్రాంచ్ కెనాల్ భూసేకరణ పూర్తైన తర్వాత అవార్డ్ జారీచేయడంతో పాటు యజమానులకు త్వరితగతిన పరిహారం చెల్లించాలని చెప్పారు.
News March 18, 2026
దివ్యాంగులతో నెల్లూరు కలెక్టర్ ప్రయాణం

నెల్లూరు జిల్లాలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభమైంది. నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్‌లో కలెక్టర్ హిమాన్షు శుక్లా, మేయర్ సుజాత, ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి బస్సును ప్రారంభించారు. తర్వాత దివ్యాంగులతో కలిసి కొంత దూరం ప్రయాణం చేశారు.


