News April 25, 2024

చీమకుర్తి: భారీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు

image

చీమకుర్తిలో ఈనెల 21న జరిగిన చోరీ కేసును చేధించినట్లు ఎస్పీ గరుడ సుమిత్ సునీల్ తెలిపారు. ఒంగోలులో మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ.. పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన పమిడి పద్మశ్రీ తన సోదరుడు మృతి చెందడంతో ఈనెల 21న బల్లికురవ వెళ్లారు. తిరిగి వచ్చే సరికి తలుపులు పగులగొట్టి దుండగులు 70 సవర్ల బంగారు అభరణాలు ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దొంగతనానికి పాల్పడిన ఇద్దరినీ అరెస్టు చేశారు.

Similar News

News October 13, 2025

ప్రకాశం: కల్తీ మందును ఇలా తెలుసుకోండి..!

image

ములకలచెరువు, విజయవాడ సమీపంలో కల్తీ మద్యం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈక్రమంలో తాము తాగేది ఒరిజనల్ హా? లేదా? కల్తీనా? అని చాలా మంది సందేహ పడుతున్నారు. ఇలాంటి వారి కోసమే ప్రభుత్వం APTATS పేరిట యాప్ తీసుకొచ్చింది. ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. సిటిజన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు కొన్న మద్యం బాటిళ్లపై ఉన్న కోడ్ అందులో ఎంటర్ చేస్తే ఒరిజనల్ లేదా? కల్తీనా అనేది తెలిసిపోతుంది.
Share It.

News October 12, 2025

హనీట్రాప్ చేసిన మార్కాపురం యువకుడు

image

సంగారెడ్డి జిల్లా హత్నూర్ PS పరిధిలోని కోనంపేటకి చెందిన విద్యార్థి మనోజ్‌ను ప్రకాశం జిల్లా యువకుడు హనీట్రాప్ చేశాడు. అనంతరం అతనివద్ద నుంచి రూ.11,20,000 వసూలు చేసిన ఘటనలో మార్కాపురం యువకుడు సంజయ్ సహా పలువురిని సంగారెడ్డి సీసీయస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతితో కలిసి న్యూడ్ వీడియో కాల్స్ చేయించి బ్లాక్మెయిల్ చేసినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News October 12, 2025

BREAKING: చీరాల బీచ్‌లో ఐదుగురు గల్లంతు

image

ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాల మండలంలో ఆదివారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. వాడరేవు సముద్ర తీరంలో అలల తాకిడికి ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఐదుగురిలో ముగ్గురి మృతదేహాలను గుర్తించారు. మరో ఇద్దరికోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.