News January 12, 2026

గ్రేటర్ విశాఖ బడ్జెట్‌ ఎంతంటే?

image

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 2026–27 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్‌కు స్థాయి సంఘం ఆమోదం తెలిపింది. మొత్తం బడ్జెట్ పరిమాణం రూ.4047.12 కోట్లుగా నిర్ణయించారు. ప్రారంభ నిల్వగా రూ.365.96 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. మొత్తం జమలు రూ.4180.37 కోట్లు కాగా, వ్యయం రూ.4047.12 కోట్లుగా అంచనా వేశారు. సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ బడ్జెట్‌ను స్థాయి సంఘం ఆమోదించింది.

Similar News

News January 22, 2026

ఖల్లీకోట్ స్టేషన్‌లో ఆగనున్న విశాఖ-హౌరా, సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు

image

ప్రయాణికుల సౌకర్యార్థం పలు రైళ్లకు ఖల్లీకోట్ రైల్వే స్టేషన్‌లో ప్రయోగాత్మక హాల్ట్‌ను కల్పిస్తున్నట్లు వాల్తేరు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. పవన్ కుమార్ తెలిపారు. ఈ నెల 26 నుంచి సికింద్రాబాద్-భువనేశ్వర్ (17016), సికింద్రాబాద్-హౌరా (12704) రైళ్లు, అలాగే 27 నుంచి భువనేశ్వర్-సికింద్రాబాద్ (17015), హౌరా-సికింద్రాబాద్ (12703) రైళ్లు ఖల్లీకోట్ స్టేషన్‌లో ఆగనున్నాయని తెలిపారు.

News January 22, 2026

గాజువాక జీవీఎంసీ సమావేశంలో కుప్పకూలిన ఇంజినీర్

image

జీవీఎంసీ గాజువాక జోనల్ కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, స్వచ్ఛంద కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్ ఉండగా ఇంజినీరింగ్ విభాగం సెక్షన్ ఇంజినీర్ గోవింద్ రాజు కుప్ప కూలిపోయారు. హుటాహుటిన ఆసుపత్రికి తోటి ఉద్యోగులు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 22, 2026

30న జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం

image

విశాఖ నగరపాలక సంస్థకు ఈ నెల 30న సాధారణ కౌన్సిల్ సమావేశం, ఫిబ్రవరి 4న 2026–27 వార్షిక బడ్జెట్‌కు ప్రత్యేక కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు మేయర్ పీలా శ్రీనివాసరావు గ్రేటర్ కమిషనర్ కేతన్ గార్గ్‌కు ప్రతిపాదనలు పంపారు. రూ.50 లక్షల పనుల అనుమతులపై ఈ నెల 27న స్థాయి సంఘం సమావేశం జరగనుంది. పాలకవర్గ పదవీకాలం మార్చి 18తో ముగియనుండగా, మార్చి 7 తర్వాత కౌన్సిల్ సమావేశాలకు నిబంధనల ప్రకారం అవకాశం లేదు.