News January 12, 2026

ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే?

image

WPL-2026లో ఆర్సీబీ ముందు యూపీ వారియర్స్ 144 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. RCB బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో యూపీ ఓపెనర్లు లానింగ్(14), హర్లీన్(11) పరుగులు రాబట్టేందుకు తడబడ్డారు. లిచ్‌ఫీల్డ్(20), కిరణ్(5) విఫలమవ్వగా ఆల్‌రౌండర్లు దీప్తి(45*), డాటిన్(40*) ఆరో వికెట్‌కు 93 పరుగులు జోడించడంతో UP 20 ఓవర్లలో 143/5 స్కోరు చేసింది. RCB బౌలర్లలో నాడిన్, శ్రేయాంక చెరో 2, లారెన్ ఒక వికెట్ తీశారు.

Similar News

News February 21, 2026

సిరీస్ పట్టేస్తారా? నేడే AUSతో చివరి టీ20

image

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా చివరి మ్యాచులో భారత మహిళల జట్టు ఇవాళ ఆస్ట్రేలియాతో తలపడనుంది. అడిలైడ్ వేదికగా మధ్యాహ్నం 1.45 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. తొలి టీ20లో వర్షం పడటంతో D/L పద్ధతిలో భారత్ విజయం సాధించింది. రెండో మ్యాచులో ఆసీస్‌ చేతిలో 19 రన్స్ తేడాతో ఓడింది. దీంతో ఈ మ్యాచ్ సిరీస్ డిసైడర్‌గా మారింది. ఇక AUS పర్యటనలో భారత జట్టు 3 వన్డేలు, ఒక టెస్ట్ కూడా ఆడనుంది.

News February 21, 2026

అవకాడో సాగు.. మొక్కలు నాటే విధానం

image

వసంతకాలంలో తగినంత ఉష్ణ వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు అవకాడో అంటుకట్టిన మొక్కలను లేదా మొగ్గ తొడిగిన మొక్కలను నాటాలి. 1x1x1 అడుగుల పొడవు, వెడల్పు, లోతు ఉండే విధంగా గుంతలను తవ్వుకొని 1 : 1 : 1 నిష్పత్తిలో మట్టి, ఇసుక మరియు పశువుల ఎరువుల మిశ్రమాన్ని నింపాలి. అనంతరం మొక్కలను నాటుకోవాలి. వరుసలలోని 2 మొక్కలకి మధ్య దూరం 15- 20 అడుగులు ఉండాలి. రెండు వరుసలకు మధ్య 20 అడుగుల దూరం ఉండేలా చూసుకోవాలి.

News February 21, 2026

కర్నూలు WDCWలో ఉద్యోగాలు.. దరఖాస్తుల ఆహ్వానం

image

AP: కర్నూలు మహిళాభివృద్ధి& శిశు సంక్షేమశాఖ (WDCW)లో 13పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు ఫిబ్రవరి 24వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి LLM/సోషల్ వర్క్/సోషల్ సైన్స్/ సైకాలజీ, LLB, పారా మెడికల్ (డిగ్రీ/డిప్లొమా), డిగ్రీ, డిప్లొమా, టెన్త్ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 18-39ఏళ్ల మధ్య ఉండాలి. జీతం రూ.13000-రూ.34,000 వరకు చెల్లిస్తారు. సైట్: https://kurnool.ap.gov.in./