News January 12, 2026
ALERT: ఈ కోడ్స్‌తో కాల్స్ చేయొద్దు!

సైబర్ నేరగాళ్లు కాల్ ఫార్వర్డింగ్ స్కామ్స్‌కు తెరలేపారు. డెలివరీ ఏజెంట్లమని చెబుతూ USSD కోడ్‌లతో కాల్స్ చేయించి యూజర్ల OTPలు తమకు వచ్చేలా చేస్తున్నారు. తర్వాత ఆయా ఖాతాల్లోని డబ్బు కాజేస్తున్నారు. 21, 61, 67 వంటి USSD కోడ్‌లతో మొదలయ్యే నంబర్లకు డయల్ చేయొద్దని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. కాల్ ఫార్వర్డింగ్ యాక్టివేట్ అయిందని భావిస్తే ##002#కి డయల్ చేసి డీయాక్టివేట్ చేయాలని చెబుతున్నారు.
Similar News
News February 16, 2026
ఒకే గ్రామంలో 15 రోజుల్లో 12 మంది మృతి

హరియాణాలోని చాయన్సలో 15 రోజుల్లో 12 మరణాలు కలకలం రేపాయి. వీరిలో ఐదుగురు స్కూల్ విద్యార్థులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గ్రామంలో దాదాపు ప్రతి ఇంట్లో ఒకరు జ్వరం, వాంతులతో బాధపడుతున్నట్లు అధికారులు తెలిపారు. కొందరి పరిస్థితి విషమంగా ఉంది. తాగునీరు కలుషితం కావడమే కారణమని అనుమానం వ్యక్తం చేశారు. 107 ఇళ్లలో వాటర్ శాంపిల్స్ సేకరించగా 23 చోట్ల బాక్టీరియా పెరుగుదల, క్లోరినేషన్ తక్కువగా ఉందని గుర్తించారు.
News February 16, 2026
మార్ముగావ్ పోర్ట్ అథారిటీలో పోస్టులు

మార్ముగావ్ పోర్ట్ అథారిటీలో 13 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, బీటెక్, పీజీ, MBA, MSc, BSc, ME/MTech(ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్), MBBSఅర్హతతో పాటు పని అనుభవం గలవారు దరఖాస్తుతో పాటు డాక్యుమెంట్స్‌ను ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://mptgoa.gov.in
News February 16, 2026
క్షేత్రపాలకుడు అంటే ఎవరు?

ఆలయం, గ్రామాన్ని రక్షిస్తాడు. ఆయన శివుని వెయ్యో అంశగా ఉద్భవించిన స్వామిగా చెబుతారు. శైవ, వైష్ణవ క్షేత్రాలలో రక్షకుడిగా ఉంటారు. తిరుమలలో రుద్రశిల, కాశీలో కాలభైరవుడు, పంచారామాల్లో జనార్దన స్వామి.. క్షేత్రపాలకులుగా కొలువై ఉన్నారు. భక్తులు, అర్చకులు ఆలయ ప్రవేశానికి ముందు ఈయన అనుమతి తీసుకోవడం సంప్రదాయం. ఈ స్వామిని దర్శించుకుంటే క్షేత్ర దర్శన ఫలం లభిస్తుందని, దుష్టశక్తుల నుంచి రక్షణ కలుగుతుందని నమ్మకం.


