News January 12, 2026

ఆర్సీబీ ఘన విజయం

image

WPL-2026లో యూపీ వారియర్స్‌పై ఆర్సీబీ ఘన విజయం సాధించింది. 144 పరుగుల లక్ష్యాన్ని 12.1 ఓవర్లలో వికెట్ నష్టపోయి ఛేదించింది. ఓపెనర్ హారిస్(85) 10 ఫోర్లు, 5 సిక్సర్లతో విధ్వంసం సృష్టించగా మరో ఓపెనర్ స్మృతి(47*) ఆమెకు సహకారం అందించారు. హారిస్ ఔటైనా రిచా(4*)తో కలిసి స్మృతి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఇది ఆర్సీబీకి వరుసగా రెండో విజయం. మరోవైపు యూపీ ఆడిన రెండు మ్యాచుల్లోనూ పరాజయం పాలైంది.

Similar News

News March 13, 2026

ఏపీ క్యాబినెట్ సమావేశం.. 27 అంశాలకు ఆమోదం

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన క్యాబినెట్ భేటీ ముగిసింది. 27 అజెండా అంశాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కాగా అనారోగ్యం కారణంగా ఈ భేటీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత సహా మంత్రులు నాదెండ్ల మనోహర్, గొట్టిపాటి రవికుమార్, టీజీ భరత్, ఎండీ ఫరూక్ హాజరుకాలేదు.

News March 13, 2026

అబ్రార్‌ది యునిక్ బౌలింగ్.. అందుకే తీసుకున్నాం: SRH హెడ్ కోచ్

image

The Hundred(ఇంగ్లండ్) టోర్నీ కోసం పాక్ స్పిన్నర్ అబ్రార్‌ను తీసుకోవడంపై SRH హెడ్ కోచ్ వెటోరీ స్పందించారు. ‘అతనిది యునిక్ బౌలింగ్. ఎన్నో వేరియేషన్స్‌తో బౌలింగ్ చేస్తారు. ఇలాంటి ప్లేయర్లను గతంలో చూసి ఉండరు. టోర్నీకి అందుబాటులో ఉంటాడనే వేలంలో కొనుగోలు చేశాం’ అని పేర్కొన్నారు. కాగా పాక్ ఆటగాడిని సన్ రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడంపై వస్తున్న <<19368622>>తీవ్ర విమర్శలపై<<>> ఓనర్ కావ్యా మారన్‌ స్పందించలేదు.

News March 13, 2026

సీఈసీపై విపక్షాల అభిశంసన నోటీసు

image

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తన పదవి నుంచి తొలగించాలని విపక్షాలు పార్లమెంటులో అభిశంసన నోటీసును ఇచ్చాయి. లోక్‌సభలో 130 మంది ఎంపీలు, రాజ్యసభలో 63 మంది ఎంపీలు ఈ తీర్మానంపై సంతకాలు చేశారు. అనేక సందర్భాల్లో.. ముఖ్యంగా SIR ద్వారా సీఈసీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరించారని విపక్షాలు తీర్మానంలో పేర్కొన్నాయి. సీఈసీపై అభిశంసన తీర్మానం పెట్టడం ఇదే తొలిసారి.