News January 13, 2026

‘మీరు చనిపోయారా?’

image

ఇదేం ప్రశ్న అని ఆశ్చర్యపోకండి. చైనాలో ‘Are you dead’ అనే యాప్ ఇప్పుడు ట్రెండింగ్. దీన్ని ఇన్‌స్టాల్ చేసుకున్న వాళ్లు 2 రోజులకోసారి అందులోని బటన్ క్లిక్ చేయాలి. యూజర్ బతికే ఉన్నారనడానికి అదే గుర్తు. అలా చేయకపోతే యూజర్ ప్రమాదంలో ఉన్నారని ఎమర్జెన్సీ కాంటాక్టులకు మెసేజ్ వెళ్తుంది. ఒంటరి యువత ఎక్కువగా ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటోందట. చైనాలో అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకున్న పెయిడ్ యాప్‌గా ఇది నిలిచింది.

Similar News

News January 28, 2026

త్వరలో విద్యుత్‌ శాఖలో ఖాళీల భర్తీ: మంత్రి గొట్టిపాటి

image

AP: విద్యుత్‌ శాఖలో ఏఈ స్థాయి ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ప్రకటించారు. రైతులు, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గత ప్రభుత్వం విద్యుత్‌ వ్యవస్థను దుర్వినియోగం చేసి ప్రజలపై రూ.30 వేల కోట్ల భారం మోపిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఛార్జీలు పెంచకుండా, ఎన్నికల లోపు తగ్గించే దిశగా అడుగులు వేస్తోందన్నారు.

News January 28, 2026

30-60 రోజుల మొక్కజొన్న పంటలో కత్తెర పురుగు నివారణ ఎలా?

image

మొక్కజొన్న పంట 31 నుంచి 60 రోజుల లోపు ఉండి పైరులో 6-10% మొక్కలను కత్తెర పురుగు రెండో దశ లార్వా ఆశించినట్లు గమనిస్తే రసాయన మందులతో సస్యరక్షణ చేపట్టాలి. లీటరు నీటికి 0.4 గ్రాముల ఇమామెక్టిన్ బెంజోయేట్ 5% SG లేదా స్పైనోశాడ్ 45% SC 0.3ml కలిపి.. చేతి పంపుతో మొక్క సుడులలో పడే విధంగా పిచికారీ చేసి కత్తెర పురుగును నియంత్రించవచ్చు. ఈ రసాయనాల పిచికారీ విషయంలో వ్యవసాయ నిపుణుల సలహా తప్పక తీసుకోండి.

News January 28, 2026

AIIMSలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

న్యూఢిల్లీలోని <>AIIMS <<>>19 (నాన్ ఫ్యాకల్టీ) గ్రూప్-A పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గలవారు FEB 20 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBBS, PG(సైకాలజీ, సోషల్ సైన్సెస్, ఎడ్యుకేషన్, హెల్త్ ఎడ్యుకేషన్), PhD, BVSc, B.Pharm, ఫార్మా డీ, MSc, BE/BTech, వెటర్నరీ డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. రాతపరీక్ష, స్క్రీనింగ్, డిస్క్రిప్టివ్ రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. సైట్: www.aiimsexams.ac.in