News January 13, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News March 15, 2026
పుట్టా మహేశ్‌ను వదిలేసిన పోలీసులు

TG: డ్రగ్స్ కేసులో పాజిటివ్ వచ్చిన TDP MP పుట్టా మహేశ్‌ను శంషాబాద్ రూరల్ పోలీసులు వదిలిపెట్టారు. ఆయనతో పాటు ఫామ్‌హౌస్‌లో పట్టుబడ్డ ప్రియాంక రెడ్డికి స్టేషన్ బెయిల్ మీద నోటీసులు ఇచ్చి పంపించేశారు. BRS మాజీ MLA పైలట్ రోహిత్ రెడ్డి, రితేశ్ రెడ్డి(రోహిత్ రెడ్డి సోదరుడు), నమిత్‌ను ఉప్పరపల్లి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. నిన్న రాత్రి మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో కొకైన్ తీసుకుంటూ మహేశ్, రోహిత్ దొరికారు.
News March 15, 2026
4 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది!

తమిళనాడు, వెస్ట్ బెంగాల్, కేరళం, అస్సాం, పుదుచ్చేరి (UT) అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. ఏప్రిల్ 9న కేరళం, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్ జరగనుంది. వెస్ట్ బెంగాల్‌లో ఏప్రిల్ 23, 29న రెండు విడతల్లో, ఏప్రిల్ 23న తమిళనాడులో ఒకే దఫాలో ఎన్నికలు జరగనున్నాయి. అన్నింటి ఫలితాలు మే 4న వెలువడనున్నాయి. 4 రాష్ట్రాలు సహా ఒక UTలో కలిపి 17.4 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు CEC జ్ఞానేశ్ కుమార్ వెల్లడించారు.
News March 15, 2026
‘భీష్మ ప్రతిజ్ఞ’ అంటే ఏమిటి?

ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేవాళ్ల గురించి చెప్పే సందర్భంలో ‘భీష్మ ప్రతిజ్ఞ’ నానుడిని వాడతారు. భారతంలో భీష్ముడి అసలు పేరు దేవవ్రతుడు. అతని తండ్రి శంతనుడు దాశరాజు కుమార్తె సత్యవతిని రెండో వివాహం చేసుకోవాలనుకుంటాడు. తన కూతురి కొడుకే రాజు కావాలని దాశరాజు కోరగా తండ్రి ఆనందం కోసం దేవవ్రతుడు అంగీకరించి ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోతారు. అందుకే ఆయనకు భీష్ముడిగా పేరు వచ్చింది.
<<-se>>#EPICSAYINGS<<>>


