News January 13, 2026
కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే లక్ష్యం: కలెక్టర్ తేజస్

జిల్లాలో మంజూరైన ‘యంగ్ ఇండియా’ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అధికారులను ఆదేశించారు. సోమవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. చిలుకూరు, గడ్డిపల్లి, తొండలలో ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు.
Similar News
News February 8, 2026
మిత్రపక్షాల సమరం.. పొంగులేటి vs కూనంనేని

అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న మిత్రపక్షాలు.. కొత్తగూడెం కార్పొరేషన్ పోరులో మాత్రం తలపడుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం మంత్రి పొంగులేటి, CPI అభ్యర్థుల కోసం MLA సాంబశివరావు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌ని గెలిపించాలని మంత్రి కోరుతుంటే, CPIని ఆదరించాలని ఎమ్మెల్యే పిలుపునిస్తున్నారు. నిన్నటి మిత్రులు నేడు ప్రత్యర్థులుగా మారి ప్రచారం చేస్తుండటంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది.
News February 8, 2026
మార్కాపురం జిల్లా రూపురేఖలు మారుస్తాం: MLA

మార్కాపురం జిల్లా సాధించడమే కాకుండా అభివృద్ధి చేసి చూపుతామని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ… చెరువును ట్యాంక్ బండ్‌లా మార్చి అన్నగారి విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. అల్లూరి పోలేరమ్మ ఆలయం వైపు కలెక్టరేట్ కార్యాలయాలను అభివృద్ధి చేస్తామన్నారు. మరోవైపు స్టేడియం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఐదు సంవత్సరాలలో మార్కాపురం జిల్లా రూపురేఖలు మారుస్తామన్నారు.
News February 8, 2026
NRPT: న్యాయవాదులుగా.. కౌన్సిలర్లుగా తమ మార్కు పాలన

నారాయణపేట మున్సిపాల్టీ పరిధిలోని పలు వార్డులలో న్యాయవాదులు కౌన్సిలర్లుగా గెలిచి తమ మార్కు పాలన అందించారు. మొట్టమొదటి సారి 1981లో న్యాయవాది సీతారామారావు మున్సిపల్ ఛైర్మన్‌గా తన మార్కు పాలన అందించి పట్టణాన్ని అభివృద్ధి చేశారు. అదే విధంగా అబ్దుల్ సలీం, ప్రభాకర్ వర్ధన్ న్యాయవాదులుగా విధులు నిర్వహిస్తూ కౌన్సిలర్లుగా పని చేశారు. ప్రస్తుతం నందు నామాజీ, అమీరుద్దీన్ లు కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో నిలిచారు.


