News January 13, 2026
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: డీఎస్పీ శ్రావణి

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రజలు కుటుంబ సభ్యులతో సరదాగా గడపాలని అనకాపల్లి డీఎస్పీ ఎం. శ్రావణి సూచించారు. సోమవారం తన కార్యాలయంలో ఆమె మాట్లాడారు. కోడి పందేలు, గుళ్ల ఆటలపై నిషేధం ఉందన్నారు. వాటి జోలికి దూరంగా ఉండాలని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News March 18, 2026
WGL: రోడ్డుపై పడేసిన నవజాత మృత మగ శిశువు

QGL పోచమ్మ మైదాన్ నుంచి అబ్నుస్ ఫంక్షన్ హాల్ వెళ్లే దారిలో బుధవారం ఉదయం మగ శిశువు మృతదేహం లభ్యమైంది. గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డు పక్కన పడేసి వెళ్లడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, శిశు సంక్షేమ శాఖ అధికారులకు వివరించారు. సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి ఎవరైనా వదిలేశారా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
News March 18, 2026
సూర్యాపేట: నేరాల నియంత్రణపై ఎస్పీ సమీక్ష

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నరసింహ నేతృత్వంలో నెలవారీ సమీక్షా సమావేశం జరిగింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా భద్రత, శాంతిభద్రతల పరిరక్షణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని, సైబర్ నేరాలు, మహిళా భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం, నిరంతర వాహన తనిఖీలు చేపట్టాలన్నారు.
News March 18, 2026
శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న 87,150 మంది భక్తులు

ఉగాది ఉత్సవాల సందర్భంగా శ్రీశైలం క్షేత్రం భక్తులతో పోటెత్తింది. బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 87,150 మంది స్వామి, అమ్మవారిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. పాదయాత్రతో కైలాస ద్వారం నుంచి 7,095 మంది, అన్నప్రసాద విభాగం ద్వారా 6,232 మంది తరలివచ్చి దర్శించుకున్నారు. భక్తుల రద్దీతో ఆలయ ఉచిత, శీఘ్ర, అతి శీఘ్ర క్యూ లైన్లన్నీ కిక్కిరిశాయి.


