News January 13, 2026

మెదక్: ST రిజర్వేషన్.. BC మహిళ సర్పంచ్!

image

సర్పంచ్ ఎన్నికలలో ఎస్టీలకు, బీసీలు అన్యాయం చేశారని బంజారా సేవాలాల్ సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ ఆరోపించారు. టేక్మాల్ మండలం వెంకటాపూర్ గ్రామానికి సర్పంచ్ ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది. ఎరుకల రాంబాయి అనే బీసీ మహిళ ఎస్టీ కులధ్రువీకరణ పత్రంతో ఎన్నికలలో పోటీ చేసి సర్పంచ్‌గా గెలుపొందింది. సర్పంచ్‌పై సమగ్ర విచారణ జరిపాలని తహశీల్దార్ తులసిరామ్‌కు వారు వినతి పత్రాన్ని సమర్పించారు.

Similar News

News February 24, 2026

కర్నూలు: ‘సర్వసభ్య సమావేశాలకు సిద్ధం కావాలి’

image

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మార్చి 1న కర్నూలు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్, విద్యాశాఖ, పౌర సరఫరాల శాఖలకు సంబంధించిన అంశాలపై సమీక్ష జరుగుతుందని సోమవారం పేర్కొన్నారు. సంబంధిత అధికారులు పూర్తి వివరాలతో, గణాంకాలతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు లేవనెత్తే అంశాలపై వివరణ ఇవ్వాలన్నారు.

News February 24, 2026

మంజీరా మరమ్మతులు.. రూ.722 కోట్లతో పనులు

image

మంజీరా వాటర్ సప్లై స్కీమ్ ఫేస్ 1, ఫేస్ 2 ఆధునీకరణ ప్రాజెక్ట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. HMWSSB ప్రతిపాదనల మేరకు రూ.722 కోట్లతో ఈ ప్రాజెక్ట్ పనులకు నిర్ణయం తీసుకుంది. రూ.282 కోట్లతో ఉస్మాన్‌సాగర్ మంచినీటి పైప్‌లైన్ ఆధునీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కాలంచెల్లిన పైపులు, పంప్‌‌హౌస్ల కారణంగా దాదాపు 30% నీటి సరఫరాలో నష్టం వాటిల్లుతోంది. ఇప్పుడున్న ప్రాజెక్టును ఆధునీకరిస్తే దీనిని అధిగమించవచ్చు.