News April 25, 2024
రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర: CM రేవంత్

రాజ్యాంగంపై బీజేపీ ఆఖరి యుద్ధం ప్రకటించిందని సీఎం రేవంత్ అన్నారు. ‘ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర చేస్తోంది. ఇందుకు సంబంధించిన బిల్లును ఆమోదింపజేసేందుకు 400 సీట్లు కావాలని అడుగుతోంది. RSS అజెండాను ఆ పార్టీ అమలు చేస్తోంది. రాజ్యాంగం కల్పించిన హక్కును కాలరాయాలని చూస్తోంది. రిజర్వేషన్లు వద్దనుకుంటే బీజేపీకి ఓటు వేయాలి. బీజేపీ ఎంతటి దురాగతానికైనా పాల్పడుతుంది’ అని ఫైరయ్యారు.
Similar News
News January 28, 2026
అమిత్ షాతో పవన్ భేటీ

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. తాజా రాష్ట్ర రాజకీయాలు, పరిపాలనకు సంబంధించిన ముఖ్య విషయాలను చర్చించామని ఆయన ట్వీట్ చేశారు. ఉప్పాడ తీరంలో గోడ నిర్మాణానికి అనుమతి ఇచ్చినందుకు అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు. తన ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులనూ పవన్ కలిశారు. కాసేపట్లో విశాఖకు బయల్దేరనున్నారు.
News January 28, 2026
అయ్యర్ ఏం పాపం చేశాడు.. గంభీర్‌పై విమర్శలు

NZతో నాలుగో టీ20 మ్యాచులో టీమ్ ఇండియా ప్లేయింగ్-11పై విమర్శలు వస్తున్నాయి. ఇషాన్ కిషన్ దూరమైతే అతడి స్థానంలో బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను కాకుండా బౌలర్ (అర్ష్‌దీప్ సింగ్)ను తీసుకోవడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయ్యర్ 3, 4 స్థానాల్లో అద్భుతంగా ఆడగలడని, ఎందుకు ఎంపిక చేయలేదని నిలదీస్తున్నారు. ఐదుగురు ప్రొఫెషనల్ బౌలర్లు జట్టులో ఎందుకని హెడ్ కోచ్ గంభీర్‌ను ప్రశ్నిస్తున్నారు.
News January 28, 2026
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సీఎం

TG: సీఎం రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 3 నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. 3న మిర్యాలగూడ, 4న జగిత్యాల, 5న చేవెళ్ల, 6న భూపాలపల్లి, 7న మెదక్, 8న నిజామాబాద్‌లో ప్రచారం చేయనున్నారు. కాగా ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుంది.


