News January 13, 2026
స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర ప్రోగ్రామ్ వాయిదా

AP: రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 17వ తేదీ జరగాల్సిన స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర ప్రోగ్రాం వాయిదా పడింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పండుగ వేళ ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు కుటుంబాలతో కలిసి ఉంటారని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి నెలా మూడో శనివారం జరగాల్సిన కార్యక్రమాన్ని జనవరిలో నాలుగో శనివారం నిర్వహించనున్నారు.
Similar News
News February 2, 2026
రావి నారాయణరెడ్డి త్యాగధనుడు: CM రేవంత్

TG: రావి నారాయణరెడ్డి జాతీయ పురస్కారాల ప్రదానోత్సవంలో CM రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. నిజాంలకు వ్యతిరేకంగా పోరాడిన నారాయణరెడ్డి ప్రజల కోసం 500 ఎకరాల భూమిని దానం చేసిన త్యాగధనుడని కొనియాడారు. ఆయన రాజకీయ ప్రస్థానం నేటి తరానికి ఆదర్శమన్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఈ పురస్కారం దక్కడం సముచితమన్నారు. జైపాల్ రెడ్డి ఓటమికి తానే కారణమైనా, ఆయన తనపై ఎప్పుడూ ద్వేషం చూపలేదని గుర్తు చేసుకున్నారు.
News February 2, 2026
తెలుగు అక్షరాలు గుండ్రంగా ఎందుకు ఉంటాయో తెలుసా?

తెలుగు లిపికి అందమైన గుండ్రని రూపం రావడానికి కారణం పూర్వం వాడిన తాళపత్రాలే. వాటిపై పదునైన లేఖినితో రాసేటప్పుడు నిలువు గీతలు గీస్తే ఆకు చిరిగిపోయే ప్రమాదం ఉండేది. ఆ ఆకు దెబ్బతినకుండా పూర్వీకులు అక్షరాలను వంపులు తిప్పుతూ గుండ్రంగా తీర్చిదిద్దారు. అలా మన తెలుగు లిపి పరిణామం చెందుతూ ఇప్పుడు అందమైన ఆకారాన్ని సంతరించుకుంది. అందుకే మన తెలుగు అక్షరాలు ప్రపంచంలోనే అత్యంత అందమైనవిగా గుర్తింపు పొందాయి.
News February 2, 2026
మానవుల్లో ఉండే 7 శక్తి కేంద్రాలు ఇవే..

మానవ శరీరంలోని వెన్నెముక వెంబడి మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార అనే 7 చక్రాలు ఉంటాయి. ఇవి ప్రాణశక్తిని ప్రసరింపజేస్తూ భౌతిక భద్రత నుంచి ఆధ్యాత్మిక జ్ఞానం వరకు ప్రతి దశను నియంత్రిస్తాయి. మూలాధారం మన మనుగడకు పునాది కాగా, సహస్రారం విశ్వశక్తితో మనల్ని అనుసంధానిస్తుంది. యోగా, ధ్యానం ద్వారా ఈ చక్రాలను ఉత్తేజితం చేస్తే సంపూర్ణ ఆరోగ్యం, మానసిక ప్రశాంతత సిద్ధిస్తాయి.


