News January 13, 2026
నిర్మల్ జిల్లాలో లేగదూడపై చిరుత దాడి

నిర్మల్ జిల్లా తానురు మండలం బెంబేరా శివారులో పాడేకర్ దేవన్నకు చెందిన లేగదూడపై చిరుత పులి దాడి చేసి చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. సోమవారం రాత్రి పశువుల పాకలో దూడను కట్టి ఇంటికెళ్లానని, ఈరోజు ఉదయం వచ్చి చూడగా మరణించిందని రైతు తెలిపాడు. రాత్రి పూట చిరుతపులి వచ్చి దాడి చేసి చంపేసిందని వెల్లడించాడు. దీంతో పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Similar News
News February 15, 2026
వేములవాడ క్షేత్రంలో భక్తజనసంద్రం.. 70 వేల మందికి దర్శనం

వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. మహాశివరాత్రి రోజున శనివారం రాత్రి 12:00 గంటల నుండి ఈరోజు ఆదివారం మధ్యాహ్నం 1:20 గంటల వరకు మొత్తం 70,189 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేసి దర్శనాలను సాఫీగా నిర్వహించారు.
News February 15, 2026
ఘనవిజయం.. సూపర్-8లోకి వెస్టిండీస్, ఇంటికి నేపాల్

T20WC: నేపాల్‌పై వెస్టిండీస్ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత నేపాల్ 20 ఓవర్లలో 133/8 రన్స్ చేసింది. దీపేంద్ర సింగ్ ఒక్కడే 58 పరుగులతో రాణించారు. అనంతరం విండీస్ కేవలం 15.2 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ హోప్ (61*), హెట్మెయిర్ (46*) రాణించారు. ఈ విజయంతో వెస్టిండీస్ గ్రూప్-C నుంచి సూపర్-8కి వెళ్లిన మొదటి జట్టుగా నిలిచింది. అటు నేపాల్ ఎలిమినేట్ అయింది.
News February 15, 2026
నిష్కల్మష భక్తికి నిలువుటద్దం ‘భక్త కన్నప్ప’

శ్రీకాళహస్తి అడవుల్లో తిన్నడు అనే బోయవాడు శివుని భక్తుడు. అమాయక భక్తితో శివలింగానికి నోటి నీటితో అభిషేకం చేసి, వేటాడిన మాంసాన్ని నైవేద్యంగా పెట్టేవాడు. అతని భక్తిని లోకానికి చాటాలని శివుడు లింగం కంటి నుంచి రక్తం కార్చాడు. దీంతో తిన్నడు తన కంటిని పెకిలించి దేవునికి అర్పించాడు. రెండో కన్ను కూడా రక్తం కారగా రెండో కంటిని తీయబోతుండగా శివుడు ప్రత్యక్షమై అతడిని ఆపి కన్నప్పగా దీవించి మోక్షం ప్రసాదించాడు.


