News April 25, 2024
ఎన్నికల బరిలో పంజాబ్ వేర్పాటువాది!

వేర్పాటువాది, వారిస్ పంజాబ్ దే గ్రూపు అధినేత అమృత్‌పాల్ సింగ్ పార్లమెంట్ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేయనున్నారు. ఖదూర్ సాహిబ్ నుంచి బరిలో ఉంటారని అతని లాయర్ తెలిపారు. ప్రస్తుతం అమృత్‌పాల్ జైలులో ఉన్నాడు. గతేడాది ఫిబ్రవరిలో తన గ్రూప్‌కి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయడంతో అంజాలా పోలీస్ స్టేషన్‌పై అతను దాడి చేశాడు. కాగా పంజాబ్‌లోని 13 ఎంపీ స్థానాలకు జూన్ 1న పోలింగ్ జరగనుంది.
Similar News
News January 27, 2026
లంకను గెలిచిన ఇంగ్లండ్.. సిరీస్ కైవసం

శ్రీలంకతో జరిగిన <<18976263>>మూడో వన్డేలో<<>> ఇంగ్లండ్ 53 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. 358 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన లంక 46.4 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. పవన్ రత్ననాయకే 121, పాతుమ్ నిస్సాంక 50 మినహా అందరూ విఫలమయ్యారు. కాగా మూడు టీ20ల సిరీస్ జనవరి 30 నుంచి ప్రారంభమవుతుంది.
News January 27, 2026
MLA వ్యవహారంలో నిజమేంటో తేల్చాలి: శైలజ

AP: జనసేన MLA <<18975483>>అరవ శ్రీధర్<<>>పై SMలో వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. బాధితురాలితో ఫోన్‌లో మాట్లాడి ఘటనపై వివరాలు సేకరించినట్లు తెలిపారు. మహిళ గౌరవం, భద్రతకు భంగం కలిగించే చర్యలను సహించబోమని స్పష్టం చేశారు. ఘటనలో నిజానిజాలు తేల్చి బాధితురాలికి అండగా ఉంటామన్నారు. దీనిపై జనసేన అంతర్గత బృందం విచారణ జరిపి పవన్‌కు నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
News January 27, 2026
‘10-3-2-1-0’ స్లీప్ ఫార్ములా.. ఏంటో తెలుసా?

రాత్రిపూట నిద్ర పట్టడం లేదా? అయితే ఈ ‘10-3-2-1-0’ స్లీప్ ఫార్ములా మీ కోసమే. పడుకోవడానికి 10 గంటల ముందు కాఫీ, 3 గంటల ముందు భోజనం/మద్యం, 2 గంటల ముందు పనులు ఆపేయాలి. ఇక గంట ముందు ఫోన్‌ను పక్కన పెట్టి, ఉదయాన్నే 0 సార్లు (అస్సలు) అలారం స్నూజ్ నొక్కకుండా లేవాలి. ఈ టిప్స్ పాటించడం వల్ల మెదడు ప్రశాంతంగా మారి గాఢ నిద్ర పడుతుందని నిపుణులు చెబుతున్నారు.


