News January 13, 2026

ఇరాన్ నిరసనలు.. ఇతడికే తొలి ‘ఉరి’..!

image

సుప్రీం లీడర్ ఖమేనీకి వ్యతిరేకంగా ఇరాన్‌లో ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ఇప్పటికే 650మందిని పోలీసులు కిరాతకంగా కాల్చి చంపారు. అయినా నిరసనకారులు వెనక్కి తగ్గకపోవడంతో వారిలో భయం పుట్టించేందుకు నియంతృత్వ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆందోళనలో పాల్గొన్న 26 ఏళ్ల ఇర్ఫాన్ సొల్తానీని రేపు ఉరి తీసేందుకు రంగం సిద్ధంచేసింది. దీంతో మానవహక్కుల ఉద్యమకారులు SMలో అతడికి మద్దతు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు.

Similar News

News February 20, 2026

బంగ్లాకు వీసా సర్వీసుల పునరుద్ధరణ

image

భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణకు బంగ్లాదేశ్ PM తారిఖ్ రెహ్మాన్ ప్రాధాన్యం ఇస్తున్నారు. అన్నిరకాల వీసా సర్వీసుల పున:ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇవాళ ఢిల్లీలోని బంగ్లా హైకమిషన్ రీఓపెన్ అయ్యింది. త్వరలోనే IND కూడా సర్వీసులను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. బంగ్లాలో హాదీ హత్యతో అల్లర్లు చెలరేగడం, అక్కడి హిందువులపై దాడితో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే.

News February 20, 2026

నవజాత శిశువుల్ని ఇలా రక్షిద్దాం..

image

నవజాత శిశువుల్లో 80 శాతం మంది నెలలు వివిధ కారణాల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని యునిసెఫ్‌ నివేదిక తెలిపింది. వీటిని నివారించడానికి న్యూ బోర్న్ స్క్రీనింగ్ ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. పుట్టిన 48-96 గంటల మధ్య ఈ పరీక్ష చేస్తారు. శిశువు మడమ నుండి రక్త నమూనాలను సేకరించి పరీక్షిస్తారు. దీనివల్ల వ్యాధులను ముందుగా గుర్తించడం వల్ల శారీరక, మానసిక వైకల్యాలతో సహా ప్రాణాంతక వ్యాధులను నివారించవచ్చు.

News February 20, 2026

TN CM స్టాలిన్‌తో పన్నీరు సెల్వం భేటీ

image

తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర దృశ్యం ఆవిష్కృతమైంది. మాజీ CM, AIADMK బహిష్కృత నేత పన్నీరు సెల్వం CM స్టాలిన్‌ను కలిశారు. ఐదేళ్ల DMK పాలనను కొనియాడారు. త్వరలో రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో DMK మరోసారి విజయం సాధిస్తుందన్నారు. CMను కలిసి ఐదేళ్ల పాలన బాగుందని చెప్పి శుభాకాంక్షలు తెలిపినట్లు పేర్కొన్నారు. ఈ భేటీతో పన్నీరుసెల్వం వర్గం DMKతో ఎన్నికలకు వెళ్తుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.