News January 13, 2026

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో తగ్గిన చలి తీవ్రత..!

image

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో గత నాలుగు రోజులుగా చలి తీవ్రత గణనీయంగా తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో అమ్రాబాద్‌లో అత్యల్పంగా 16.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. బల్మూరులో 16.6, నాగర్‌కర్నూల్‌లో 16.8, లింగాల, తెలకపల్లిలో 17.1 డిగ్రీల చొప్పున కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పెరగడంతో ప్రజలకు చలి నుంచి ఉపశమనం లభించింది.

Similar News

News February 5, 2026

భారత్.. ప్రపంచానికి ఆశాకిరణం: మోదీ

image

ప్రపంచంలో అనిశ్చితి నెలకొన్న సమయంలో ఇండియా ఆశాకిరణంగా మారిందని PM మోదీ అన్నారు. ‘అభివృద్ధి చెందిన దేశాలు వృద్ధాప్యంలోకి వెళ్తున్నాయి. కానీ భారత్ యవ్వనంలోకి వస్తోంది. అధిక వృద్ధి, తక్కువ ద్రవ్యోల్బణం మన దగ్గరే ఉన్నాయి. గ్లోబల్ సౌత్ గురించి ప్రపంచం మాట్లాడుతోంది. గ్లోబల్ సౌత్ గొంతుక ఇండియా’ అని అన్నారు. గతంలో మనతో డీల్స్ చేసుకునేందుకు ఏ దేశమూ రెడీగా లేదని పరోక్షంగా కాంగ్రెస్‌ పాలనను విమర్శించారు.

News February 5, 2026

NZB: CM సభ.. ట్రాఫిక్ డైవర్షన్

image

మాక్లూర్, నందిపేట్ వైపు నుంచి సభకు వచ్చే వాహనాలు దాస్ నగర్, మాణిక్ బండార్ చెక్క నుంచి అమ్రాద్ , ఓడ్డేటిపల్లి, కేశపూర్ మీదుగా త్రిమూర్తి COLD STORAGE సమీపంలోని పార్కింగ్ ప్రాంతాలకు చేరుకోవాని CP సాయి చైతన్య తెలిపారు. బోధన్ వైపు నుంచి వచ్చే వాహనాలు అర్సపల్లి జంక్షన్-అర్సపల్లి రైల్వే గేట్, కలెక్టరేట్, కంఠేశ్వర్, మాధవ నగర్ బైపాస్, కేశపూర్ కమాన్ మీదుగా చేరుకోవాలని సూచించారు.

News February 5, 2026

ప.గో జిల్లా కలెక్టర్ హెచ్చరిక

image

భీమవరంలోని లోసరి రోడ్డులోని విష్ణు కన్వెన్షన్‌లో గురువారం పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో “పంచాయతీరాజ్ కార్యకలాపాలపై సమీక్ష” నిర్వహించారు. కలెక్టర్ చదలవాడ నాగరాణి పన్నులు, పన్నేతర వసూలు, వర్మి కంపోస్ట్ తయారీ, అందుబాటులో ఉన్న ఘన వ్యర్ధాల నిర్వహణ కేంద్రాలు, అంశాలపై సమీక్షించారు. పన్నుల వసూలలో నిర్లక్ష్య ధోరణి కనిపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.