News January 13, 2026

51పోస్టులు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<>BEL<<>>) కొద్వారా యూనిట్‌లో 51 ట్రైనీ ఇంజినీర్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి BE/B.Tech/BSc(Engg.), MBA/MCom ఉత్తీర్ణులై, వయసు 28ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, DV ద్వారా ఎంపిక చేస్తారు. పరీక్ష JAN 25న నిర్వహిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.177. SC, ST, PwBDలకు ఫీజు లేదు. సైట్: bel-india.in

Similar News

News February 23, 2026

మేం హిందుత్వ రాజకీయాలు చేయం: భాగవత్

image

RSS హిందుత్వ రాజకీయాలు చేయదని, కేవలం వ్యక్తి నిర్మాణంతో సమాజం, దేశాభివృద్ధిని మాత్రమే కోరుకుంటుందని సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. శక్తిమంతమైన వ్యక్తులే బలమైన సమాజాన్ని నిర్మించగలరని, అందుకే వ్యక్తి వికాసమే తమ లక్ష్యమని డెహ్రాడూన్‌లో జరిగిన శతాబ్ది ఉత్సవాల్లో మాట్లాడారు. సంఘ్ వాస్తవ రూపాన్ని బయటి నుంచి చూసి అర్థం చేసుకోలేమని, ఆ లోతును గ్రహించాలంటే లోపల ఉండి చూడాలని ఆయన వ్యాఖ్యానించారు.

News February 23, 2026

80 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

UPSC ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌ ఎగ్జామినేషన్-2026కు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఈ నోటిఫికేషన్ ద్వారా 80 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ(BZC, ఫిజిక్స్, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, జియోలజీ, అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, Engg., ఎనిమల్ హజ్బెండరీ& వెటర్నరీ సైన్స్) ఉత్తీర్ణులు అర్హులు. వయసు 21- 32ఏళ్ల మధ్య ఉండాలి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.upsc.gov.in

News February 23, 2026

ముర్రా జాతి గేదెలను ఎలా గుర్తించాలి?

image

ముర్రా జాతి గేదెల శరీరం నల్లగా నిగనిగలాడుతూ, మూతి భాగం సన్నగా పొడవుగా గుర్రంలా ఉంటుంది. ఈ జాతి గేదెల కొమ్ములు పొడవుగా పెరగకుండా, లోపలికి వంపు తిరిగినట్లు ఉంటాయి. ఈ పశువుల ముందు భాగం సన్నగా, వెనుక భాగం లావుగా ఉంటుంది. తోక కూడా నల్లగా, కొన్ని పశువులకు చివరన తెల్లకుచ్చు ఉంటుంది. పాల పొదుగులో ముందు రెండు చనుమొనలు కొంత పొట్టిగా, వెనుకవి రెండూ పొడవుగా ఉండడం ఈ జాతిలో కనిపించే మరో లక్షణం.