News January 13, 2026
చౌటుప్పల్: విధుల్లో ఉన్న కానిస్టేబుల్ దుర్మరణం

చౌటుప్పల్ సమీపంలోని ధర్మోజిగూడెం వద్ద తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ నరేశ్ కుమార్ ప్రాణాలు కోల్పోయారు. సంక్రాంతి వేళ క్రైమ్ బీట్ డ్యూటీలో భాగంగా రోడ్డు దాటుతుండగా.. అతివేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఆయనను ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో నరేశ్ అక్కడికక్కడే మృతి చెందారు. సీఐ మన్మథ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నరేశ్‌ది మునగాల మండలం తాడువాయి.
Similar News
News February 22, 2026
చిత్తూరు: పులిగుండు కొండపైన సినిమా షూటింగ్

టాలీవుడ్ లెజెండ్ కృష్ణ మనవడు, దివంగత రమేశ్ బాబు తనయుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్న ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రం షూటింగ్ శనివారం పెనుమూరు మండలం పులిగుండు వద్ద జరిగింది. సీనియర్ నిర్మాత అశ్విని దత్ నిర్మిస్తున్న ఈ చిత్రం హిందూ పుణ్యక్షేత్రాల నేపథ్యంలో భక్తి, భావోద్వేగాలతో సాగనుంది. ఘట్టమనేని వారసుడి తొలి చిత్రం కావడంతో ఆసక్తి నెలకొంది. షూటింగ్ వద్ద స్థానిక ప్రజలు చూసేందుకు ఎగబడ్డారు.
News February 22, 2026
జీడిమామిడిలో వచ్చిన కాయలు నిలబడాలంటే?

జీడిమామిడిలో పూత తర్వాత వచ్చిన కాయలు చిన్నగా ఉన్నప్పుడే రాలిపోతుంటాయి. చాలా తోటల్లో ఇది కనిపిస్తుంది. ఈ సమస్య తగ్గి కొత్తగా వచ్చిన కాయలు నిలబడాలంటే 19-19-19 లేదా మల్టికే(13-0-45)ను లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి కాయలు తడిచేలా పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల కాయలు మొక్కలపై నిలబడి, దిగుబడి పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
News February 22, 2026
పండుగ రోజుల్లో ముహూర్తాలు ఎందుకు ఉండవు?

ముహూర్త శాస్త్రం ప్రకారం.. విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి తిథులు శుభకార్యాలకు అనుకూలం. శ్రీరామనవమి, దుర్గాష్టమి, వినాయక చవితి పండుగ తిథులు అశుభ తిథుల కోవలోకి వస్తాయి. లోక కళ్యాణం కోసం దైవం ఆ రోజుల్లో అవతరించినా, సామాన్యుల వ్యక్తిగత కార్యాలకు (వివాహం, గృహప్రవేశం) ఆ తిథి బలం సరిపోదు. అందుకే పండుగ పవిత్రమైనా, శాస్త్రం నిర్దేశించిన తిథి శుద్ధి లేని కారణంగా ముహూర్తాలు నిర్ణయించరు.


