News January 13, 2026

KNR: ఖాకీపై ‘ఖాదీ’ ఒత్తిడి.. సీపీ అకస్మాత్తు సెలవు

image

అవినీతిపై కఠినంగా వ్యవహరించిన కరీంనగర్ సీపీకి రాజకీయ సెగ తగిలింది. ఇసుక మామూళ్ల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ఎస్సైని సస్పెండ్ చేయగా, సదరు అధికారిని వెనకేసుకొస్తూ స్థానిక ఎమ్మెల్యే తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ఫోన్ల ద్వారా ఒత్తిళ్లు పెరగడంతో విసుగు చెందిన సీపీ విధులకు దూరంగా ఉంటూ సోమవారం నుంచి సెలవుపై వెళ్లారు. పోలీసు వర్గాల్లో ఈ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.

Similar News

News February 25, 2026

VKB: ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్.. 272 మంది ABSENT

image

ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు 272 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు నోడల్ అధికారి శంకర్ నాయక్ తెలిపారు. బుధవారం జిల్లాలో 8,672 మంది విద్యార్థులకు గానూ 8,400 మంది విద్యార్థులు మొదటి పరీక్షకు హాజరు కాగా 272 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు చెప్పారు. జనరల్- 7,262 మంది విద్యార్థులకు 7,080 మంది హాజరుకాగా 182 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్- 1410 మందికి 1,320 హాజరుకాగా 90 మంది గైర్హాజరయ్యారు.

News February 25, 2026

సీఎంను ప్రత్యేకంగా ఆకట్టుకున్న ఓ విద్యార్థిని చిత్రలేఖనం

image

మార్కాపురం బహిరంగ సభలో ఓ విద్యార్థిని గీసిన చిత్రలేఖనం సీఎం చంద్రబాబును ప్రత్యేకంగా ఆకట్టుకుంది. మార్కాపురం జిల్లా చెన్నకేశవ స్వామి గోపురం, సీఎం చిత్రాల అందంగా ఉండడంతో విద్యార్థినిని సీఎం అభినందించారు. ఈ చిత్రలేఖనంలో చాలా అర్థం దాగి ఉందని ప్రజలకు వివరించారు. ఆ దేవుడితో పెట్టుకుంటే పతనం ఖాయమని హెచ్చరించారు.

News February 25, 2026

అనిల్ అంబానీ ముంబై నివాసం అటాచ్

image

మనీ లాండరింగ్ కేసులో రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి ఈడీ మరో షాక్ ఇచ్చింది. ముంబైలోని ఆయన నివాసం ‘అబోడ్’ను అటాచ్ చేసింది. పాలిహిల్ ప్రాంతంలో ఉన్న ఈ 17 ఫ్లోర్ల లగ్జరీ భవనం విలువ రూ.3,716 కోట్లు. దీంతో ఇప్పటివరకు మొత్తం ఆస్తుల <<18184400>>జప్తు<<>> విలువ రూ.15,700 కోట్లకు చేరింది. ఈ కేసులో అనిల్ మరోసారి ఢిల్లీలోని ఈడీ ఎదుట త్వరలో హాజరుకానున్నారు. గతేడాది ఆగస్టులో ఆయన ఈడీ విచారణ ఎదుర్కొన్నారు.