News January 13, 2026

జీడిమామిడిలో వచ్చిన కాయలు నిలబడాలంటే?

image

జీడిమామిడిలో పూత తర్వాత వచ్చిన కాయలు చిన్నగా ఉన్నప్పుడే రాలిపోతుంటాయి. చాలా తోటల్లో ఇది కనిపిస్తుంది. ఈ సమస్య తగ్గి కొత్తగా వచ్చిన కాయలు నిలబడాలంటే 19-19-19 లేదా మల్టికే(13-0-45)ను లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి కాయలు తడిచేలా పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల కాయలు మొక్కలపై నిలబడి, దిగుబడి పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

Similar News

News February 1, 2026

పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం

image

ఐసీసీ U19 వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌పై 58 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన యంగ్ ఇండియా 252 రన్స్ చేయగా, పాక్ 194 పరుగులకే ఆలౌటైంది. ఆయుశ్ మాత్రే, ఖిలాన్ చెరో 3 వికెట్లు, అంబరీశ్, హెనిల్, చౌహాన్, విహాన్ తలో వికెట్ చేశారు. ఈ గెలుపుతో ఆయుశ్ సేన జైత్ర యాత్రను కొనసాగిస్తూ సెమీ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది.

News February 1, 2026

పార్టీ ఫండ్ నుంచి ఆ పరికరాలు కొన్నారా: KCRను ప్రశ్నించిన సిట్!

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసుపై సిట్ పలు ప్రశ్నలు వేస్తూ KCRను విచారించినట్లు సమాచారం. ‘ప్రభాకర్ రావు సర్వీసును ఎందుకు పొడిగించారు? ఆయనకే 2 పోస్టులెందుకు ఇచ్చారు? ట్యాపింగ్ పరికరాలకు పార్టీ నిధులు వాడారా?’ అని ప్రశ్నించినట్లు సమాచారం. BRSకు ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చిన వారి పేర్లు ట్యాపింగ్ లిస్టులో ఎందుకు ఉన్నాయంటూ అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను ఆయన ముందు పెట్టినట్లు తెలుస్తోంది.

News February 1, 2026

చంద్రబాబు హింసా జ్వాలను రాజేస్తున్నారు: జగన్

image

AP: మాజీ మంత్రి జోగి రమేష్‌తో YCP చీఫ్ వైఎస్ జగన్ ఫోన్లో మాట్లాడారు. ఆయన ఇంటిపై జరిగిన దాడి ఘటనపై పరామర్శించారు. ‘ప్రశ్నించే వారిని భయపెట్టడానికి చంద్రబాబు హింసా జ్వాలను రాజేస్తున్నారు. అవే మంటలు CBN ప్రభుత్వాన్ని దహించి వేయక తప్పదు’ అని హెచ్చరించారు. భయపడొద్దని, పార్టీ మొత్తం అండగా ఉంటుందని జోగి రమేశ్‌కు భరోసా ఇచ్చారు.