News January 13, 2026

‘చైనా పార్టీ’తో BJP సమావేశంపై కాంగ్రెస్ ఫైర్

image

సరిహద్దుల్లో చైనా షాక్స్‌గామ్ వ్యాలీని ఆక్రమించుకుంటూ ఉంటే.. BJP నేతలు ఆ దేశ కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులతో ఢిల్లీలో రహస్య చర్చలు జరపడం ఏంటని కాంగ్రెస్ నిప్పులు చెరిగింది. గల్వాన్‌లో సైనికులు ప్రాణత్యాగం చేసినా, అరుణాచల్‌లో చైనా గ్రామాలు కడుతున్నా BJPకి పట్టదా? అని సుప్రియా శ్రీనేత్ ప్రశ్నించారు. అసలు ఈ బంధం వెనక ఉన్న ఒప్పందం ఏంటని ధ్వజమెత్తారు. BJP నేతలతో CCP ప్రతినిధులు సోమవారం సమావేశమయ్యారు.

Similar News

News February 26, 2026

మారిన మనుషులు.. స్నేహితులే వద్దంట!

image

బంధాలే కాదు స్నేహాలూ తగ్గిపోయాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది. బిజీ లైఫ్‌స్టైల్, స్మార్ట్‌ఫోన్ అడిక్షన్‌తో ఫ్రెండ్‌షిప్ ఆన్‌లైన్‌కే పరిమితమైంది. 1960ల్లో ఒక్కొక్కరికీ వంద మంది స్నేహితులుంటే 1990 సమయంలో ఐదుగురికి, ప్రస్తుతం ఒక్కరికి పడిపోయింది. దేశంలో 15% మందికి అసలు ఫ్రెండ్సే లేరు. దీనిని ‘ఫ్రెండ్‌షిప్ రిసెషన్’ అంటారు. ఇది ఒంటరితనానికి దారితీసి డిప్రెషన్‌లోకి నెట్టేస్తుంది. మీకు ఫ్రెండ్స్ ఉన్నారా?

News February 26, 2026

తప్పెవరిది? శిక్ష ఎవరికి?

image

TG: GOVT స్థలాలు, నదీ తీరాల్లో ఆక్రమణలను తొలగించడంలో ప్రభుత్వ నిర్ణయం భేష్. HYDలో హైడ్రా, ఖమ్మం <<19243296>>భూదాన్<<>> వ్యవహారంలో సర్కారు తీరును తప్పు పట్టలేం. కానీ తప్పెవరిది? శిక్ష ఎవరికి? పడుతుందనేదే ప్రశ్న. అక్రమార్కులు రూ.కోట్ల డబ్బు దండుకొని సామాన్యులకు స్థలాలను అంటగట్టారు. కష్టపడి కట్టుకున్న గూడు కూలిపోతుంటే ఇప్పుడు వారి గుండె పగులుతోంది. వీరికి ఆ అక్రమార్కుల నుంచి భారీ పరిహారం ఇప్పిస్తే బాగుంటుంది.

News February 26, 2026

తీర్థం ఎలా తీసుకోవాలి?

image

తీర్థం స్వీకరించడానికి హస్త గోకర్ణ ముద్రను ఉపయోగించాలి. కుడిచేతి బొటనవేలుతో చూపుడు వేలును నియంత్రించాలి. మిగిలిన 3 వేళ్లను ముందుకు చాచాలి. దీన్నే గోకర్ణ ముద్ర అంటారు. ఇంట్లో పూజ ముగిశాక 3 సార్లు, గుడిలో అయితే ఓసారి తీర్థం తీసుకోవాలి. తీర్థాన్ని శబ్దం రాకుండా, కింద పడకుండా సేవించాలి. ఉపవాసం చేసే వారు ఉదయం, సాయంత్రం తీర్థం తీసుకునేటప్పుడే ఉపవాసం పూర్తయినట్లు లెక్క.