News January 13, 2026

సంగారెడ్డి: కళాశాలలకు ప్రయోగశాల నిధులు

image

సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ ఇంటర్ కళాశాలల్లో ప్రయోగశాలల బలోపేతానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఒక్కో కళాశాలకు రూ. 50,000 చొప్పున కేటాయించినట్లు ఇంటర్మీడియట్ విద్యాధికారి గోవింద్ రామ్ తెలిపారు. ప్రయోగ పరీక్షల సమయంలో విద్యార్థులు ఇబ్బందులు పడకుండా, అవసరమైన రసాయనాలు, పరికరాలను ఈ నిధులతో కొనుగోలు చేయాలని ప్రిన్సిపల్‌లను ఆదేశించారు. దీంతో విద్యార్థులకు ప్రయోగాత్మక విద్య మరింత చేరువ కానుంది.

Similar News

News February 13, 2026

HNK: మున్సి’పోల్’.. ఒక్క ఓటుతో గెలుపు

image

HNK జిల్లా పరకాల మున్సిపాలిటీ ఫలితాల లెక్కింపు ఉత్కంఠగా సాగుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఈ క్రమంలో మొదటి రౌండ్‌లో 17వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సుభద్ర ఒక్క ఓటు తేడాతో గెలుపొందారు. ఒక్క ఓటుతో గెలువడంతో రీ కౌంటింగ్ చేసినా.. ఒక్క ఓటు అధికంగా రావడంతో అధికారులు సుభద్ర గెలుపును ప్రకటించారు.

News February 13, 2026

ఎల్లారెడ్డి మున్సిపల్ పీఠం కాంగ్రెస్‌దే

image

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 12 వార్డుల్లో 10 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఒక వార్డులో బీఆర్ఎస్ విజయం సాధించగా, మరో వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. ఫలితాలతో కాంగ్రెస్ శ్రేణుల్లో సంబరాలతో ఆనందం వెల్లివిరిసింది.

News February 13, 2026

కల్వకుర్తి: ‘ఒక్క ఓటు’ తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి విజయం!

image

కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఎజాస్ ఒక్క ఓటు తేడాతో ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థికి 259, బీఆర్ఎస్ అభ్యర్థి తాహెర్కు 258, బీజేపీ అభ్యర్థి రాఘవేందర్ గౌడ్‌కు 161, స్వతంత్ర అభ్యర్థి మనోహర్ రెడ్డికి 229 ఓట్లు పోలయ్యాయి. మొదటిసారి ఓట్ల లెక్కింపులో రెండు ఓట్లు మెజార్టీ రాగా రీకౌంటింగ్ చేయగా ఒక్క ఓటుతో కాంగ్రెస్ గెలిచింది.