News January 13, 2026
VMLD: బద్ది పోచమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు

వేములవాడలోని బద్ది పోచమ్మ తల్లి ఆలయానికి మంగళవారం అమ్మవారికి ఇష్టమైన రోజు కావడంతో భక్తులు కుటుంబ సమేతంగా అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయం భక్తులతో రద్దీగా మారింది. ఈ మేరకు భక్తులు ప్రీతికరమైన బోనాల నైవేద్యాలను, పసుపు కుంకుమలను అమ్మవారికి సమర్పించుకున్నారు. అందరిని చల్లగా చూడు తల్లి అంటూ బద్ది పోచమ్మ తల్లిని వేడుకున్నారు. మేడారం జాతర సందర్భంగా మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు తరలివచ్చారు.
Similar News
News February 11, 2026
SBI సరికొత్త రికార్డు!

బ్యాంకింగ్ దిగ్గజం SBI సరికొత్త రికార్డు సృష్టించింది. మార్కెట్ విలువలో తొలిసారి ₹10 లక్షల కోట్ల మార్కును దాటింది. రిలయన్స్, HDFC, ఎయిర్‌టెల్, TCS, ICICI బ్యాంక్ తర్వాత ఈ ఘనత అందుకున్న ఆరో కంపెనీగా నిలిచింది. అత్యంత విలువైన కంపెనీల్లోనూ ఆరో స్థానంలో నిలిచింది. మరోవైపు SBI షేరు నిన్న ₹1,154తో ఆల్ టైమ్ హై అందుకుంది. ఏడాదిలో 67.5% ఎగిసింది. ఇందులో వాటాలున్న LICకి ₹40 వేల కోట్ల లాభం రావడం గమనార్హం.
News February 11, 2026
మనస్సును ప్రశాంతంగా మార్చే భైరవీ ముద్ర

సుఖాసనంలో కానీ పద్మాసనం/వజ్రాసనంలో కూర్చోవాలి. నడుం వంగకుండా నిటారుగా ఉండేలా చూడాలి. రెండు చేతులను ఒళ్లో ఉంచి ఒక అరచేతిలో ఇంకో అరచేయి పెట్టి ఉంచాలి. కుడి చేయి పైన , ఎడమ చేయి కింద ఉండేవిధంగా చూసుకోవాలి. కళ్లు మూసుకుని నెమ్మదిగా శ్వాసతీసుకుని వదులుతూ శ్వాసమీద ధ్యాసను ఉంచాలి. కనీసం 7నిమిషాల సమయం ఈ భైరవి ముద్రలో ఉంటే మనస్సు ప్రశాతంగా ఉంటుందంటున్నారు నిపుణులు.
News February 11, 2026
కర్నూలుపై నంద్యాల జట్టు భారీ విజయం

కర్నూలు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న MA ఇస్పహాన్ మెమోరియల్ ట్రోఫీ అండర్-14 లీగ్ మ్యాచ్‌లో మంగళవారం నంద్యాల(సి) జట్టు ఘన విజయం సాధించింది. కర్నూలు(సి) జట్టుపై 125 పరుగుల భారీ తేడాతో గెలిచినట్లు అసోసియేషన్ జిల్లా కార్యదర్శి దేవేంద్ర గౌడ్ తెలిపారు. నంద్యాల జట్టు ప్లేయర్ శ్రీవేంద్రనాథ్ 71 పరుగులతో పాటు 5 వికెట్లు తీసి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మెరిశాడు. ధనుష్ సాయి 5 వికెట్లు పడగొట్టాడు.


