News January 13, 2026
BHPL: ఆస్తి కోసం తమ్ముడిపై అన్న కుటుంబం దాడి

గణపురం మండలం సీతారాంపురంలో ఆస్తి వివాదం నేపథ్యంలో అన్న, అతడి భార్య, కుమారులు కలిసి తమ్ముడిపై కర్రలతో దాడి చేసి హత్యాయత్నం చేసిన ఘటన చోటుచేసుకుంది. వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటకు చెందిన మహమ్మద్ సర్వర్ అహ్మద్‌పై తీవ్రంగా దాడి చేయగా తలకు గాయాలయ్యాయి. బాధితుడు భూపాలపల్లి 100 పడకల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ ఘటనపై గణపురం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 18, 2026
కాకినాడ: దారుణం.. ఒంటిపై పెట్రోల్ పోసి..!

తునిలోని శ్రీరామ థియేటర్ సెంటర్‌లో బుధవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. బైక్, సైకిల్ మెకానిక్స్ మధ్య జరిగిన గొడవ హింసాత్మకంగా మారింది. వాగ్వాదం తీవ్రం కావడంతో బైక్ మెకానిక్.. సైకిల్ మెకానిక్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. నిందితుడు PSలో లొంగిపోగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 18, 2026
గుంటూరు: కాంట్రాక్టర్లపై క్రిమినల్ చర్యలకు కలెక్టర్ ఆదేశాలు

ఇళ్ల నిర్మాణాల్ని మధ్యలోనే ఆపేసిన కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో గుంటూరు కలెక్టర్ తమీమ్ అన్సారీయా అధికారులను ఆదేశించారు. ఉగాది నాటికి జిల్లాలో 22,952 గృహాల లక్ష్యం పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు. ఉపాధి హామీలో పనులు చేసుకోవచ్చన్నారు. బిల్లుల చెల్లింపు వెంటనే జరుగుతుందని లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు.
News February 18, 2026
GNT: అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు జిల్లా న్యాయస్థానం బుధవారం బెయిల్ మంజూరు చేసింది. సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల్లో లాటరీ పెట్టి డబ్బులు వసూలు చేసినట్లు నమోదైన కేసులో ఈ తీర్పును వెలువరించింది. పోలీసుల కస్టడీ పిటిషన్‌ని న్యాయస్థానం డిస్మిస్ చేసింది. పోలీసులు మరో పీటీ వారెంట్ వేయకుంటే అంబటి మరికొద్ది గంటల్లో జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉందని YCP నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


