News January 13, 2026

ఆభరణాలు నల్లగా మారాయా? ఇలా చేయండి

image

☛ఒక గిన్నెలో డిష్‌వాష్ లిక్విడ్ వేసి అందులో నగలు నాననివ్వాలి. తర్వాత మెత్తని బ్రష్‌తో తోమి శుభ్రం చేస్తే మునుపటి రూపు సంతరించుకుంటాయి.
☛ డిటర్జెంట్ పౌడర్, ఒక చెక్క నిమ్మరసం వేడి నీటిలో కలిపి ఆభరణాలను వేసి 5నిమిషాలు ఉంచాలి.
☛బంగారు గాజులను నీటిలో నానబెట్టి రెండు చెంచాల శనగపిండిలో తగినంత వెనిగర్ కలిపి, మెత్తని పేస్టులా చేసి గాజులకు పట్టించాలి. తర్వాత బ్రష్‌తో రుద్ది కడిగితే కొత్తవాటిలా మెరుస్తాయి.

Similar News

News February 24, 2026

శ్రీకాకుళంలో డయేరియా కలకలం

image

AP: రాజమండ్రి <<19216426>>కల్తీ<<>> పాల ఘటన మరువక ముందే శ్రీకాకుళంలో భారీగా డయేరియా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు ఈరోజు ప్రాణాలు కోల్పోగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. నిన్న ఒక్కరోజే 25 కేసులు నమోదు కాగా మొత్తం సంఖ్య 76కు చేరింది. బాధితులు జీజీహెచ్, కిమ్స్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా బాధితులకు మెరుగైన ట్రీట్మెంట్ ఇవ్వాలని <<19224272>>సీఎం<<>> ఇప్పటికే అధికారులకు సూచించారు.

News February 24, 2026

ఇంగ్లండ్‌తో పోరు.. పాక్ స్కోరు ఎంతంటే..?

image

T20 WC సూపర్-8లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో పాక్ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 164-9 పరుగులు చేసింది. ఓపెనర్ ఫర్హాన్(63) రాణించగా, బాబర్ ఆజమ్(25), ఫఖర్ జమాన్(25) ఫర్వాలేదనిపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో డాసన్ 3, ఓవర్టన్, ఆర్చర్ తలో 2, రషీద్ ఒక వికెట్ తీశారు.

News February 24, 2026

7 లక్షల మంది ఆస్తిహక్కు పత్రాలు తీసుకోలేదు: అనగాని

image

AP: పేదలకు ఇళ్ల పేరిట గత ప్రభుత్వంలో ₹6,000 కోట్లు స్వాహా చేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. ‘22 లక్షల మందికి ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తే 7 లక్షల మంది కన్వేయన్స్ డీడ్స్ (ఆస్తిహక్కు పత్రాలు) తీసుకోలేదు. చెరువులు, ముంపు ప్రాంతాల్లో స్థలాలివ్వడంతో 2.5 లక్షల మంది అసలు పట్టాలే తీసుకోలేదు. తీసుకున్న వారిలో 43,948 మంది అనర్హులున్నారు. మరో 1,11,037 పట్టాలను పరిశీలిస్తున్నాం’ అని తెలిపారు.