News January 13, 2026
సింగరాయకొండలో చైనా మాంజా తగిలి ఉద్యోగికి గాయాలు

చైనా మాంజా తగిలి ఉద్యోగికి గాయాలైన ఘటన మంగళవారం సింగరాయకొండలో చోటుచేసుకుంది. బాధితుడు, పోస్ట్‌మ్యాన్ గోపి వివరాల మేరకు.. ఉదయాన్నే ఉత్తరాల బట్వాడా చేసే సమయంలో గాలిపటానికి ఉపయోగించే చైనా మాంజా దారం మెడకు తగిలి గాయాలయ్యాయి. స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మాంజ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని కోరారు.
Similar News
News March 13, 2026
పవన్ ‘ఫ్లాప్ స్టార్’: MLA తాటిపర్తి

యర్రగొండపాలెం MLA తాటిపర్తి చంద్రశేఖర్ సోషల్ మీడియా వేదికగా DyCM పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. సినిమాల్లో ‘పవర్ స్టార్’ బిరుదు ఎలా వచ్చిందో దేవుడికే తెలుసని వ్యాఖ్యానించిన ఆయన, ప్రభుత్వ పరిపాలనలో మాత్రం ఫ్లాప్ స్టార్ అయిపోయారని ట్వీట్ చేశారు. గత రెండేళ్లలో అటవీ శాఖ ద్వారా కేవలం రూ.83 కోట్ల సంపద మాత్రమే సృష్టించారని, ఆ డబ్బు కూడా షూటింగ్ ట్రిప్పులకే ఖర్చు అయిపోయి ఉంటుందని ఎద్దేవా చేశారు.
News March 13, 2026
ప్రకాశం: మత్స్యకారుడి గొంతులో ఇరుక్కున్న బతికున్న చేప.. చివరికి

ప్రకాశం జిల్లాలో గురువారం వింత ఘటన చోటుచేసుకుంది. ఒంగోలుకు చెందిన ఓ మత్స్యకారుడు చేపల వేటకు వెళ్లాడు. అనంతరం చేపలు పట్టి బుట్టలో వేస్తుండగా ఓ చేప ఎగిరి అతని నోటిలో పడింది. తీసేలోపే అది కాస్తా గొంతులోకి వెళ్లింది. గమనించిన తోటి మత్స్యకారులు అతణ్ని వెంటనే ఒంగోలు GGHకు తరలించారు. ENT వైద్యులు HOD డాక్టర్ ప్రభాకర్ బృందం శస్త్రచికిత్స చేసి చాపను బయటకు తీశారు. ప్రస్తుతం సుబ్రహ్మణ్యం ఆరోగ్యంగా ఉన్నారు.
News March 13, 2026
ప్రకాశం: ఓ ఫొటోతో ఆగిన పెళ్లి.. తల్లీకూతుర్లు సూసైడ్

ప్రకాశం జిల్లా మార్టూరు (M) ద్రోణాదులలో విషాదం నెలకొంది. స్థానికుల వివరాల మేరకు.. సుజాత (46) కుమార్తె (26) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. మార్టూరు వాసి శేషుబాబుతో డిసెంబర్ 14న ఆమెకు ఎంగేజ్‌మెంట్ జరిగింది. దివ్యకు పరిచయం ఉన్న ఓ యువకుడు ఆమెతో దిగిన ఫొటోను శేషుబాబుకు పంపాడు. దీంతో పెళ్లి ఆగిపోగా.. మనస్తాపంతో దివ్య, సుజాత ఈ నెల 4న పురుగుల మందు తాగారు. గుంటూరులో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు.


