News January 13, 2026

నల్గొండ: ‘చిట్టిమల్లు’ రేపిన పల్నాటి యుద్ధం..!

image

పల్నాటి యుద్ధం.. తెలుగు వాళ్లకు పేరిన్నిక గల యుద్ధం. ఈయుద్ధానికి కారణం ఓ కోడి పుంజు అని తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఆ పుంజే చిట్టిమల్లు. ఒకప్పుడు పల్నాడులో రాజ్యాల మధ్య ఆధిపత్య, ఆక్రమణల కుట్రలు సాగాయి. నాయకురాలు నాగమ్మ కోడిపై గెలవడం కోసం బ్రహ్మనాయుడు మహిమ గల కోడి కోసం ఆరా తీస్తాడు. ఆనాడు శక్తిమంతమైన చిట్టిమల్లుగా పిలిచే పుంజును కుందూరు చోడుల రాజధానిగా ఉన్న మన NLG పానగల్లు నుంచే తీసుకెళ్లారు.

Similar News

News January 26, 2026

RGM: ఎన్నికల వేడి.. నామినేషన్ల ముందే ప్రచారం జోరు

image

పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాకముందే పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు తమ డివిజన్‌లో ప్రచారం ముమ్మరం చేశారు. వివిధ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా ప్రజలను కలిసి ప్రజా సమస్యలపై అవగాహన కల్పించి, తమను గెలిపించాలని కోరుతున్నారు. ఎన్నికల ప్రక్రియ మొదలుకాకముందే రామగుండంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది.

News January 26, 2026

భారత్‌కు కెనడా ప్రధాని! సంబంధాలు గాడిన పడినట్లేనా?

image

కెనడా PM మార్క్ కార్నీ మార్చిలో భారత్‌కు వచ్చే అవకాశం ఉంది. యురేనియం, ఎనర్జీ, మినరల్స్, AI వంటి రంగాల్లో ఒప్పందాలు కుదిరే ఛాన్స్ ఉందని భారత్‌లోని ఆ దేశ హై కమిషనర్ దినేశ్ పట్నాయక్ వెల్లడించారు. USతో కెనడాకు ఈ మధ్య చెడింది. మరోవైపు కెనడా మాజీ PM ట్రూడో అధికారంలో ఉండగా భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య దూరం పెరిగింది. ఈ నేపథ్యంలో కార్నీ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.

News January 26, 2026

భూపాలపల్లి జిల్లాలో 87,134 మంది లబ్ధిదారులు

image

మహిళా శక్తి ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నట్లు భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. సమ్మక్క సారక్క మహిళా జిల్లా సమాఖ్యలో 87,134 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. బ్యాంకు లింకేజి ద్వారా ఇప్పటి వరకు జిల్లాలో రూ.240 కోట్లకు పైగా రుణాలు అందించమని. అదే విదంగా మహిళాలకు 1,17,220 ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు.