News January 13, 2026
ఇరాన్ నిరసనల్లో 12 వేల మంది చనిపోయారా?

ఇరాన్ నిరసనల్లో 2వేల మంది <<18846903>>చనిపోయారని<<>> వార్తలు వచ్చాయి. కానీ అక్కడి ప్రతిపక్షాలు మాత్రం భద్రతా దళాల కాల్పుల్లో 12వేల మంది చనిపోయారని సంచలన ఆరోపణలు చేశాయి. ఇది ఇరాన్ ఆధునిక చరిత్రలో అతిపెద్ద మారణకాండ అని, లెక్కలోకి రాని మరణాలు వందల్లో ఉండొచ్చని Iran International సంస్థ చెప్పింది. ఈనెల 8, 9తేదీల్లో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్, బాసిజ్ యూనిట్లు చేసిన దాడుల్లో ఎక్కువ మంది చనిపోయారని తెలిపింది.
Similar News
News February 23, 2026
టీటీడీలో కొత్త చట్టం.. స్వర్ణ దేవాలయం తరహాలో!

AP: TTDలో నిబంధనలు కఠినతరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయంలో ఉన్నట్లుగా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని యోచిస్తోంది. తప్పు చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు ఈ దిశగా అడుగులేస్తోంది. అన్య మతస్థులు శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాలనే రూల్‌ను కఠినతరం చేయాలని CM చంద్రబాబు నిర్ణయించారు. స్వర్ణ దేవాలయ చట్టంపై స్టడీ చేయాలని ఆదేశాలిచ్చారు.
News February 23, 2026
ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్ 70% పూర్తి

హను రాఘవపూడి డైరెక్షన్‌లో ప్రభాస్ నటిస్తోన్న ‘ఫౌజీ’ మూవీ షూటింగ్ 70% పూర్తయినట్లు సమాచారం. తాజాగా 20 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఇందులో డార్లింగ్ మాస్ ఎలిమెంట్స్ అదిరిపోయాయని, ఇది ప్రేక్షకులకు థ్రిల్‌ను అందిస్తుందని మూవీ వర్గాలు చెబుతున్నాయి. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్, జయప్రద, మిథున్ చక్రవర్తి కూడా పాల్గొన్నారని పేర్కొన్నాయి. ఈ పార్ట్ కథలో కీలకమైన మలుపుగా ఉంటుందట.
News February 23, 2026
పచ్చిపాలతో మెరిసే చర్మం

* పచ్చి పాలు, తేనె కలిపి ఆ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కాటన్ బాల్స్‌తో శుభ్రం చేసుకోవాలి. కొద్ది సేపటికి చల్లటి నీటితో ముఖాన్ని కడగాలి. దీంతో చర్మం మృదువుగా మారుతుంది. * పచ్చి పాలలో అరటి పండును కలిపితే అది చర్మానికి మరింత మేలు చేస్తుంది. దీని కోసం కొద్దిగా పచ్చిపాలు, సగం అరటి పండు వేసి మెత్తగా కలపాలి. ఆ పేస్ట్‌ను ముఖంపై అప్లై చేసి 20నిమిషాల తర్వాత కడిగేసుకుంటే సరిపోతుంది.


