News January 13, 2026

భద్రాద్రి: మురిసిన ముత్తాత వంశం.. 5 తరాల ఆత్మీయ సమ్మేళనం

image

దుమ్మగూడెం(M) నడికుడి గుడి సమీపంలో కొమరం వీరయ్య – బుచ్చమ్మ (లేట్) దంపతుల వంశీయుల ఆత్మీయ సమ్మేళనం సోమవారం ఘనంగా జరిగింది. వారి ఐదుగురు కుమార్తెల కుటుంబాలకు చెందిన కొడుకులు, కోడళ్లు, మనవళ్లు, మునిమనవళ్లతో కలిపి మొత్తం 5 తరాల సభ్యులు 178 మంది ఓకే వేదికపై కలుసుకున్నారు. చిన్నచిన్న విషయాలకే విడిపోతున్న కుటుంబ వ్యవస్థలో రక్తసంబంధీకులందరూ ఇలా కలిసి ఉండటం నేటి తరానికి ఆదర్శమని స్థానికులు చెబుతున్నారు.

Similar News

News February 14, 2026

BHEL 47 పోస్టులకు నోటిఫికేషన్

image

ఝాన్సీలోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) 47 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. BE/BTech, డిప్లొమా, ఐటీఐ, ఇంటర్ అర్హతగల వారు మార్చి 15 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ముందుగా అప్రెంటిస్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వయసు 18 నుంచి 27ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: https://jhs.bhel.com

News February 14, 2026

సుప్రీంకోర్టులో 19 ఏళ్ల కుర్రాడి సంచలన విజయం!

image

కేవలం 12వ తరగతి చదివిన 19 ఏళ్ల అథర్వ చతుర్వేది సుప్రీంకోర్టులో హిస్టరీ క్రియేట్ చేశారు. NEET క్వాలిఫై అయినా EWS కోటాలో సీటు రాకపోవడంతో తనే స్వయంగా SLP డ్రాఫ్ట్ చేసి సీనియర్ లాయర్లలా వాదించారు. 10 నిమిషాల్లో జడ్జిలను ఒప్పించగలిగారు. ప్రైవేట్ కాలేజీల్లోనూ EWS కోటాను నోటిఫై చేయాలని కోర్టు నేషనల్ మెడికల్ కౌన్సిల్, మధ్య‌ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో అథర్వకు మెడికల్ సీటు కన్ఫామ్ అయ్యింది.

News February 14, 2026

ఇలాంటి పశుగ్రాసం పాడి పశువులకు అవసరం

image

పాడి పశువులకు అందిచే గ్రాసం రుచిగా, ఎక్కువ మాంసకృత్తులు కలిగి ఉండాలి. తక్కువ కాలంలో కోతకు వచ్చి ఎక్కువ దిగుబడి ఇచ్చేదిగా ఉండాలి. నీటి ఎద్దడిని తట్టుకొని ఏ దశలో కోసినా రుచికరంగా ఉండాలి. ఎలాంటి విష పదార్థాలు ఉండకూడదు. అన్ని కాలాల్లో మంచి దిగుబడిని ఇవ్వాలి. అన్ని రకాల నేలల్లో తక్కువ నీటితో సాగు చేసుకోగలినదై ఉండాలి. తెగుళ్లను తట్టుకునేలా, కోసిన తర్వాత రోజుల తరబడి నిల్వచేసుకొనుటకు వీలుగా ఉండాలి.