News January 13, 2026
సిరిసిల్ల: ‘రోడ్డు భద్రత చర్యలు పకడ్భందీగా చేపట్టాలి’

రోడ్డు భద్రతా చర్యలు పకడ్బందీగా చేపట్టాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. రోడ్డు సేఫ్టీ కమిటీ సమావేశాన్ని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం ఆర్అండ్‌బీ, నేషనల్ హైవేస్, పీఆర్, పోలీస్, ట్రాన్స్ పోర్ట్, వైద్యా, ఎక్సైజ్, విద్య, ఆర్టీసీ తదితర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
Similar News
News January 28, 2026
మున్సిపల్ ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సన్నద్ధం

జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో త్వరలో జరగనున్న ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ అనుదీప్ మంగళవారం తెలిపారు. ఎదులాపురం, వైరా, మధిర, కల్లూరు, సత్తుపల్లి మున్సిపాలిటీల్లోని ఓటర్ల జాబితాలపై ప్రజల నుంచి మొత్తం 417 అభ్యంతరాలు రాగా, వాటిని పరిశీలించి పరిష్కరించినట్లు వివరించారు. ఈ 5మున్సిపాలిటీల పరిధిలోని మొత్తం 117 వార్డులకు గాను 242 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశామన్నారు.
News January 28, 2026
సంగారెడ్డి: ‘దివ్యాంగులకు ఉచిత సహాయక ఉపకరణాలు’

సంగారెడ్డి జిల్లాలో అర్హులైన దివ్యాంగ విద్యార్థులు, నిరుద్యోగ దివ్యాంగులు ఈనెల 30 వరకు www.tgobmms.cgg.gov.in ద్వారా ఉచిత సహాయక ఉపకరణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి మంగళవారం తెలిపారు. దరఖాస్తు చేసిన అనంతరం సంబంధిత ధ్రువ పత్రాలతో జిల్లా సంక్షేమ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. అర్హులు వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News January 28, 2026
మెదక్: హత్య కేసులో నిదితుడికి జీవిత ఖైదు

మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి కంపెనీ వద్ద బీహార్ రాష్ట్రానికి చెందిన సర్వాన్ కుమార్ హత్యకు పాల్పడిన నిందితుడు ఓం ప్రకాష్ రాయ్‌కి జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ తీర్పునిచ్చినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. సునీల్ మొంజి, ధనుంజయ్, సర్వాన్ కుమార్ సోదరులు ఓ కంపెనీలో పనిచేస్తూ ఇక్కడే ఉంటున్నారన్నారు. ఓం ప్రకాష్ రాయ్ రాయితో కొట్టి హత్య చేసినట్లు వివరించారు.


