News January 13, 2026

BREAKING: నల్గొండ జిల్లాలో విషాదం

image

నల్గొండ(D) మర్రిగూడ(M) చర్లగూడెం ప్రాజెక్టు ముంపు గ్రామమైన వెంకేపల్లిలో ఈరోజు విషాదం చోటు చేసుకుంది. SI కృష్ణారెడ్డి తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన దంపతులు గోగుల అంజయ్య, శారదకు ముగ్గురు సంతానం. వారిలో ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి అక్షయ్ కుమార్(10). కాగా ప్రాజెక్టు మట్టి కోసం తవ్విన గుంతలో అక్షయ్ ఈతకు వెళ్లి మృతిచెందాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో కుటుంబం శోకసముద్రంలో మునిగింది.

Similar News

News February 5, 2026

కృష్ణా: నవోదయలో ఖాళీ సీట్ల భర్తీ.. అడ్మిట్ కార్డ్ విడుదల!

image

2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వేలేరు జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం ఈ నెల 7వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ డి. ఎదునందన తెలిపారు. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అడ్మిట్ కార్డులు విడుదల చేసినట్లు వెల్లడించారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను cbseitms.rcil.gov.inలో డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.

News February 5, 2026

ఎనుమాముల మార్కెట్‌లో పెరిగిన మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో గురువారం మిర్చి ధరలు కాస్త పెరిగాయి. వండర్ హాట్ బుధవారం క్వింటాకు రూ.37,100 ధర పలకగా, గురువారం క్వింటా రూ.900 పెరిగి రూ.38,000 అత్యధిక ధర పలికింది. యూఎస్ 341 రకానికి బుధవారం క్వింటాకు రూ.26,200 ధర పలకగా, గురువారం క్వింటాకు రూ.500 పెరిగి క్వింటాకు రూ.26,700 ధర పలికింది. తేజ రకం మిర్చి క్వింటాకు రూ.200 పెరిగి గురువారం క్వింటాకు రూ.19,500 ధర పలికింది.

News February 5, 2026

GNT: 42 బార్ల కోసం 122 దరఖాస్తులు.. మరికొద్దిసేపటల్లో లాటరీ!

image

గుంటూరు జిల్లాలో బార్ల అనుమతుల కోసం వచ్చిన దరఖాస్తులను గుంటూరు కలెక్టరేట్‌లో నేడు లాటరీ తీయనున్నారు. మొత్తం 42 బార్ల కోసం నోటిఫికేషన్ ఇవ్వగా 122 దరఖాస్తులు వచ్చాయి. జీఎంసీ పరిధిలో 26 బార్లకు 84 దరఖాస్తులు అందాయి. అదేవిధంగా మంగళగిరి, తాడేపల్లి పరిధిలో 6 బార్లకు 24, పొన్నూరులో ఒక బార్ కి 6 దరఖాస్తులు వచ్చాయి. తెనాలిలో 9 బార్ల కోసం 8 దరఖాస్తులు దాఖలయ్యాయి. ఎవరి భవితవ్యం ఎలా ఉంటుందో చూడాలి.