News January 13, 2026
చిత్తూరులో మహిళ మృతి

చిత్తూరులో గుర్తుతెలియని మహిళ మృతి చెందిన సంఘటన మంగళవారం వెలుగు చూసింది. పట్టణంలోని పీసీఆర్ సర్కిల్లో 45 నుంచి 50 సంవత్సరాల లోపు వయసున్న మహిళ మృతి చెంది ఉండగా స్థానికులు గుర్తించారు. పోలీసులు విచారించగా రెండు రోజులుగా అదే ప్రాంతంలో ఆమె ఉన్నట్టు, ఆరోగ్యం క్షీణించి మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. వివరాలు తెలిసినవారు 08572 234100 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
Similar News
News January 27, 2026
గురుకుల ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

రామకుప్పం Dr.BR అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రజనీ కుమార్ తెలిపారు. 5వ తరగతిలో 80 సీట్లు, Jr inter MPC లో 40, Bipc లో 40, 6 నుంచి 10వ తరగతి వరకు మిగులు సీట్లకు అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరింత సమాచారం http://apgpcet.apcfss.in ను సంప్రదించాలన్నారు.
News January 26, 2026
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన SP

చిత్తూరు క్యాంపు కార్యాలయంలో ఎస్పీ తుషార్ డూడీ రిపబ్లిక్ డే పురస్కరించుకొని జాతీయ పతాకాన్ని సోమవారం ఆవిష్కరించారు. పోలీసు సిబ్బంది గౌరవ వందనం చేశారు. సిబ్బందికి ఆయన రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మురళీమోహన్, ఎంటీఓ వీరేశ్ పాల్గొన్నారు.
News January 26, 2026
చిత్తూరు: జెండా వందనం చేసిన కలెక్టర్

చిత్తూరు పోలీస్ పరేడ్ మైదానంలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను అధికారులు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడీతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లా అధికార యంత్రాంగానికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే డా. థామస్, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, జిల్లా అధికార యంత్రాంగం, విద్యార్థులు పాల్గొన్నారు.


