News January 13, 2026

‘మెదక్ జిల్లాను ఛార్మినార్ జోన్‌లో కలపాలి’

image

మెదక్ జిల్లాను సిరిసిల్ల జోన్ నుంచి తొలగించి, చార్మినార్ జోన్‌లో కలపాలని కోరుతూ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌కు ఉద్యోగ సంఘాలు వినతిపత్రం అందజేశాయి. ప్రస్తుత జోన్ వల్ల పదోన్నతుల్లో ఉద్యోగులకు, ఉద్యోగ అవకాశాల్లో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జిల్లాల పునర్విభజనపై పునరాలోచన చేస్తున్న తరుణంలో, మెదక్‌ను చార్మినార్ జోన్‌లో చేర్చి న్యాయం చేయాలని కోరారు.

Similar News

News February 4, 2026

పదవ తరగతిలో మెరుగైన ఫలితాలే లక్ష్యం: డీఈవో

image

విద్యార్థులు క్రమశిక్షణతో, పట్టుదలతో చదివి 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని DEO విజయలక్ష్మి పిలుపునిచ్చారు. పాపన్నపేట మండలం యూసుఫ్‌పేట ఉన్నత పాఠశాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడిన డీఈవో, చదువుపై పూర్తి దృష్టి సారించాలని, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయుల మార్గనిర్దేశాన్ని పాటిస్తూ లక్ష్య సాధనకు కృషి చేయాలని విద్యార్థులకు హితవు పలికారు.

News February 3, 2026

మెదక్: ఎన్నికల భద్రతపై డీజీపీ సమీక్ష

image

మున్సిపల్ ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాస రావుతో కలిసి పలు సూచనలు చేశారు. ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా బందోబస్తు ఏర్పాటు చేయాలని, సమస్యాత్మక కేంద్రాలు, రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని డీజీపీ ఆదేశించారు. పోలీసులకు ఎన్నికల చట్టాలపై లీగల్ అవగాహన కల్పించి, విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News February 3, 2026

మెదక్ మున్సిపల్ బరిలో 113 మంది.. ఒక వార్డు ఏకగ్రీవం

image

మున్సిపల్ ఎన్నికల పోరులో మెదక్ మున్సిపాలిటీలో అభ్యర్థుల ఖరారు పూర్తయింది. మొత్తం 32 వార్డులకు గాను, 32వ వార్డు కౌన్సిలర్‌గా గోదల మానస సాయిరాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 31 వార్డుల్లో 112 మంది పోటీలో నిలిచారు. ప్రధాన పార్టీల వారీగా.. కాంగ్రెస్ 32, బీఆర్‌ఎస్ 31, బీజేపీ 27 వార్డుల్లో అభ్యర్థులను నిలపగా, బీఎస్పీ 6 చోట్ల పోటీ చేస్తోంది. ఇద్దరు కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు ఉండటం ఆసక్తికరంగా మారింది.