News January 13, 2026
స్వర్ణ నారావారిపల్లెలో DRDA ఆధ్వర్యంలో రుణాలు

స్వర్ణ నారావారిపల్లెలో భాగంగా DRDA ఆధ్వర్యంలో సున్న వడ్డీకి రుణాలు మంజూరు చేయించి, జ్యూట్ మెషిన్స్-2, ఈ- ఆటోలు 5, మిల్లెట్ కార్ట్ 2, 1 కొర్రమీను ఫిష్ యూనిట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. వీటి విలువ రూ. 27,25,750 ఉండగా, 11 మంది లబ్ధిదారులు ఉన్నారు. PMEGP ద్వారా రూ. 17.5 లక్షలు విలువ చేసే 3 ఆవులు, చేపల పెంపకానికి రూ. 4.5 లక్షలు, మిల్లెట్ కార్ట్‌లకు రూ. 2.34 లక్షలు మంజూరు చేశారు.
Similar News
News January 28, 2026
కృష్ణా: పవన్ కళ్యాణ్‌తో ఎంపీ బాలశౌరి భేటీ

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి బుధవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్‌ను ఎంపీ కలిశారు. సుమారు గంటపాటు సాగిన ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్‌లో ఉన్న వివిధ ప్రాజెక్టులపై కూలంకషంగా చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మచిలీపట్నం పోర్టు పనులు, నియోజకవర్గ సమస్యలను పవన్ దృష్టికి బాలశౌరి తీసుకెళ్లారు.
News January 28, 2026
ప్రభుత్వ పథకాలను రైతులకు చేరువ చేయండి: కలెక్టర్

జిల్లాలో వివిధ పంటలు సాగు చేస్తున్న రైతులకు ఖర్చులకు అనుగుణంగా పంట రుణాల మంజూరుకు మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ (కేడిసిసి) ఎన్టీఆర్ జిల్లా స్థాయి సాంకేతిక కమిటీ సమావేశం బుధవారం కలెక్టరేట్‌లో జరిగింది. గత ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లలో వివిధ పంటల సాగు వ్యయం, పంట దిగుబడి విలువ, రుణ పరిమితి వివరాలను కలెక్టర్ పరిశీలించారు.
News January 28, 2026
నిజామాబాద్: జిల్లా కలెక్టర్‌తో ఎలక్షన్ అబ్జర్వర్ భేటీ

మున్సిపల్ ఎన్నికల జనరల్ అబ్జర్వర్ సి.హెచ్. సత్యనారాయణ రెడ్డి బుధవారం నిజామాబాద్ కలెక్టరేట్‌లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠితో భేటీ అయ్యారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు చేసిన ఏర్పాట్లపై కలెక్టర్ ఆయనకు వివరించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం పూర్తి పారదర్శకంగా, పకడ్బందీగా ఎన్నికలు జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు.


