News January 13, 2026
ఆయుర్వేద ఫార్మసీ విచారణ ఏమైంది..?

టీటీడీ పరిధిలోని శ్రీనివాసమంగాపురం… నరసింగాపురం ఆయుర్వేద ఫార్మసీలో అనేక అక్రమాలు జరిగాయని బోర్డు సభ్యులు ఒక్కరు ఆరోపించారు. అక్కడ జరిగిన అవినీతి అక్రమాలపై విజిలెన్స్ విచారణ సైతం జరిగింది. ఆరోపణలు వచ్చి ఆరు నెలల ముగిసినా ఇప్పటివరకు ఆ నివేదిక ఏమైంది? అసలు నిజంగా అవినీతి జరిగిందా లేదా అనేది ప్రకటించలేదు. దీనిపై టీటీడీ స్పష్టత ఇవ్వాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
Similar News
News February 24, 2026
మెదక్: ‘పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలి’

ఇంటర్, పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై సీఎస్ రామకృష్ణారావు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ శ్రీనివాస్ రావు పాల్గొన్నారు. ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్, మార్చి 14 నుంచి పదో తరగతి పరీక్షలు జరుగుతాయని సీఎస్ తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా విద్యా, పోలీస్, ఆర్టీసీ, వైద్య శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.
News February 24, 2026
పెద్దపల్లి: 100 డేస్ హెల్త్ క్యాంపెయిన్‌కు సీపీఆర్ శిక్షణ

పెద్దపల్లి జిల్లాలో మార్చి 2 నుంచి జూన్ 9 వరకు నిర్వహించనున్న 100 డేస్ హెల్త్ క్యాంపెయిన్‌కు సన్నాహకంగా ఆర్‌బీఎస్కే బృందాలకు మంగళవారం సీపీఆర్ శిక్షణ అందించారు. కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో డా.కె.ప్రమోద్ కుమార్ పర్యవేక్షణలో ట్రైనర్ డా. నిస్సీ క్రిస్టియానా శిక్షణ ఇచ్చారు. పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో డా. కిరణ్ కుమార్, డా. శ్రీరాములు పాల్గొన్నారు.
News February 24, 2026
వనపర్తి: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం.. ఉదయం 8:30AM నుంచే అనుమతి!

ఈనెల 25 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు DIEO అంజయ్య తెలిపారు. జిల్లాలోని 25 కేంద్రాల్లో మొత్తం 12,653 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే పరీక్ష కోసం విద్యార్థులను 8:30 నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తామని ఆయన స్పష్టం చేశారు.


