News January 13, 2026
తల్లిదండ్రుల అవినీతి డబ్బును పిల్లలు తిరస్కరించాలి: SC

తల్లిదండ్రులు సంపాదించిన అవినీతి డబ్బును పిల్లలు తిరస్కరించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ BV నాగరత్న కోరారు. ‘తమ తల్లిదండ్రులు ఆదాయానికి మించి సంపాదించిన దేన్నైనా పిల్లలు తీసుకోకూడదు. వాటికి లబ్ధిదారులుగా ఉండొద్దు. ఇది దేశానికి చేసిన గొప్ప సేవ అవుతుంది’ అని పేర్కొన్నారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏకు చట్టబద్ధతపై దాఖలైన పిల్ విచారణ సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
Similar News
News February 10, 2026
రంజాన్ మాసం.. ముస్లిం ఉద్యోగులకు గుడ్ న్యూస్

AP: రంజాన్ మాసం సందర్భంగా ప్రభుత్వం ముస్లిం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉపవాసాల నేపథ్యంలో ఒక గంట ముందే ఇంటికి వెళ్లేందుకు అనుమతించింది. ఈనెల 18 నుంచి మార్చి 19 వరకు ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ ఉద్యోగులు డ్యూటీ నుంచి ఒక గంట ముందే ఇంటికి వెళ్లొచ్చని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
News February 10, 2026
మాట్లాడుకుంటేనే సమస్యలకు పరిష్కారం

భార్యాభర్తల జీవన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు వస్తుంటాయి. కొన్నిసార్లు అహం అడ్డం, ఇంకొన్నిసార్లు అపార్థాలు పలకరిస్తాయి. అలకలూ ఉంటాయి. వాటిని దాటితేనే బంధం పదిలంగా మారుతుంది. అభిప్రాయ భేదాలు వచ్చి అలిగినా తెగేదాకా లాగొద్దు. భాగస్వామితో నేరుగానే మాట్లాడి పరిష్కరించుకోండి. సమస్య ఏదైనా ఎదుటివారికి మాట్లాడే అవకాశం ఇవ్వాలి. లేదంటే సమస్య పరిష్కారం కాకపోగా అవతలివారిలో రోజు రోజుకీ అసంతృప్తి పెరిగిపోతుంది.
News February 10, 2026
మేక్రాన్ భారత పర్యటన తేదీలు ఖరారు

ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ భారత పర్యటన తేదీలు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఆయన ఇండియాలో పర్యటించి ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. 2047 వరకు ఇరుదేశాలు అనుసరించే వ్యూహాలపై చర్చిస్తారని తెలిపింది.


