News January 14, 2026

ఎంఎస్‌ఎంఈ పార్కుకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి

image

దెందులూరు నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటుకు తక్షణమే ప్రతిపాదనలు రూపొందించాలని పరిశ్రమల శాఖ రాష్ట్ర కార్యదర్శి యువరాజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం సోమవరప్పాడులో పార్కు కోసం ప్రతిపాదించిన స్థలాన్ని కలెక్టర్ కె.వెట్రిసెల్వి, ఇతర అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. పారిశ్రామికాభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిశీలించి, సమగ్ర నివేదిక పంపాలని ఈ సందర్భంగా ఆయన దిశానిర్దేశం చేశారు.

Similar News

News February 19, 2026

బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత: అదనపు కలెక్టర్

image

సంగారెడ్డి జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అదనపు కలెక్టర్ నగేష్ పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్ ఆవరణలో ‘బాల్య వివాహ ముక్త్ భారత్’ 100 రోజుల ప్రత్యేక ప్రచార వాహనాన్ని జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

News February 19, 2026

కాంగ్రెస్ బడ్జెట్ కూతురికి జన్మనివ్వడం లాంటిది: రాజస్థాన్ BJP ఎమ్మెల్యే

image

రాష్ట్ర బడ్జెట్‌ను కొడుకు, కూతురితో పోలుస్తూ రాజస్థాన్ BJP MLA బహదూర్ సింగ్ కోలి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘BJP ప్రభుత్వం 3 బడ్జెట్లలో కొడుకులకు జన్మనిచ్చింది. కానీ గత కాంగ్రెస్ బడ్జెట్ మాత్రం కూతురికి జన్మనివ్వడం లాంటిది. మాది యువకులకు ఉద్దేశించినది. కానీ కాంగ్రెస్‌ది వృద్ధాప్యానికి సంబంధించినది. కొడుకు అంటే ఉపయోగకరం. కాంగ్రెస్‌కు కొడుకు పుట్టలేదు. అందుకే ప్రతిపక్షంలో ఉంది’ అని సభలో అన్నారు.

News February 19, 2026

మా ఆయిల్ ఇండియా కొనదని US చెబితే నమ్మాలా: రష్యా

image

రష్యా క్రూడాయిల్‌ కొనుగోళ్లు ఆపేందుకు ఇండియా <<19145614>>ఒప్పుకుందని<<>> అమెరికా చెబుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇండియా వైఖరి మార్చుకుందని తాము నమ్మడం లేదని రష్యా తెలిపింది. ‘మా హైడ్రోకార్బన్లను కొనడం 2 దేశాలకు ప్రయోజనం. అంతర్జాతీయ మార్కెట్లో స్థిరత్వాన్ని కొనసాగించడంలో సాయపడుతుంది’ అని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా అన్నారు. US వాదనల్లో కొత్తదనం ఏమీ లేదని విమర్శించారు.