News January 14, 2026
నేటి ముఖ్యాంశాలు

❃ తెలుగు ప్రజలకు ఇరు రాష్ట్రాల సీఎంల పండగ విషెస్
❃ AP:అదనపు ఛార్జీలు వసూలు చేస్తే బస్సులు సీజ్: మండిపల్లి
❃ వైద్య శాఖకు ₹567 కోట్ల కేంద్ర నిధులు: సత్యకుమార్
❃ TG: గ్రామపంచాయతీలకు రూ.277 కోట్లు విడుదల
❃ అటెన్షన్ డైవర్షన్ కోసమే కమిషన్‌లు, సిట్‌ల ఏర్పాటు: KTR
❃ ఓల్డ్ సిటీలో కరెంట్ బిల్లులు చెల్లించట్లేదు: ఎంపీ కొండా
❃ కవిత కాంగ్రెస్‌లో చేరడం లేదు: పీసీసీ చీఫ్
❃ కుక్క కాటు మరణాలకు భారీ పరిహారం: SC
Similar News
News April 6, 2026
ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ.. 6 వేల మందికి ఉద్యోగాలు!

TG: 2026-27 నుంచి 3 వేల స్కూళ్లలో ప్రీ ప్రైమరీ విద్యను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. UKG క్లాసులు అవసరమైన పాఠశాలల లిస్టు పంపాలని DEOలకు ఆదేశాలిచ్చింది. దీంతో కొత్తగా 6 వేల మందికి తాత్కాలికంగా ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం 1,300కు పైగా స్కూళ్లలో UKG క్లాసులు నడుస్తున్నాయి. వాటిలో ఆయాలు, ఇన్‌స్ట్రక్టర్లను నియమించి ₹6 వేలు, ₹8 వేల చొప్పున ప్రభుత్వం వేతనం ఇస్తోంది.
News April 6, 2026
యుద్ధం.. 45 రోజులపాటు కాల్పుల విరమణ?

అమెరికా-ఇరాన్ యుద్ధాన్ని ముగించే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 45 రోజుల కాల్పుల విరమణ ఒప్పందంపై రీజనల్ మీడియేటర్లు చర్చిస్తున్నట్లు Axios మీడియా సంస్థ తెలిపింది. వచ్చే 48 గంటల్లో డీల్ జరగొచ్చని చెప్పింది. పాక్, ఈజిప్ట్, తుర్కియే మధ్యవర్తులు చర్చల్లో పాల్గొంటున్నారని పేర్కొంది. ట్రంప్ ప్రతినిధి విట్కాఫ్, ఇరాన్ మంత్రి అరాఘ్చీ మధ్య టెక్స్ట్ మెసేజ్‌ల ద్వారా కమ్యూనికేషన్ జరుగుతోందని వెల్లడించింది.
News April 6, 2026
BREAKING: తగ్గిన బంగారం ధరలు

అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో HYD బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24, 22 క్యారెట్ల పసిడి ధరలు తగ్గాయి. 24క్యారెట్ల 10గ్రా.ల గోల్డ్ రేటు రూ.1,800 తగ్గి రూ.1,49,130కు చేరింది. 22క్యారెట్ల 10గ్రా.ల పసిడి ధర రూ.1,650 పతనమై రూ. 1,36,700 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.2,55,000గా ఉంది.


