News January 14, 2026

కపిలతీర్థం ఆలయ అర్చకులు సేవలు క్రమబద్ధీకరణ

image

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయ అర్చకులు సేవలు క్రమబద్ధీకరణ చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. మణివాచకర్ గురుకుల్, స్వామినాథన్ గురుకుల్ మిరాసియేతర అర్చకులుగా పనిచేస్తున్నారు. వారి సేవలను క్రమబద్ధీకరణ కోసం టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి పంపగా.. ప్రభుత్వం మంగళశారం జీవో విడుదల చేసింది.

Similar News

News February 1, 2026

కేంద్ర బడ్జెట్‌పై ఎంపీ ఉదయ్ హర్షం

image

కేంద్ర బడ్జెట్ అన్ని రంగాలను సంతృప్తిపరిచేలా ఉందని కాకినాడ MP తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆదివారం అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లోని అపార ఖనిజ వనరులను దృష్టిలో ఉంచుకుని ‘రేర్ ఎర్త్ కారిడార్’ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం శుభపరిణామమని పేర్కొన్నారు. దీని ద్వారా రాష్ట్రంలో భారీగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చిన నిర్మలా సీతారామన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

News February 1, 2026

గద్వాల: రేపటి నుంచి రెండో విడత సీఎం కప్ క్రీడలు

image

గద్వాల జిల్లాలో ఈ నెల 2, 3 తేదీల్లో రెండో విడత సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడల అధికారి (DYSO) కృష్ణయ్య తెలిపారు. గద్వాల, అలంపూర్, అయిజ వంటి పలు మండలాలు, మున్సిపాలిటీల్లో ఈ పోటీలు జరుగుతాయన్నారు. తహశీల్దార్లు, ఎంపీడీవోలు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని, క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News February 1, 2026

పెళ్లైన 60 రోజులకే భర్తను గొంతు కోసి చంపిన భార్య

image

UP బరేలీలో పెళ్లైన 2 నెలలకే భార్య తన భర్తను చంపేసింది. 9 ఏళ్లు ప్రేమించుకున్న జితేంద్ర, జ్యోతి గతేడాది NOVలో పెళ్లి చేసుకున్నారు. జితేంద్ర ఆన్‌లైన్ జూదానికి బానిసై, భార్య ఖాతా నుంచి రూ.20 వేలు తీసుకున్నాడు. దీనిపై వివాదం చెలరేగగా కుటుంబ సభ్యులతో కలిసి ఆమె భర్త గొంతు కోసి చంపేసింది. మృతదేహాన్ని కిటికీకి వేలాడదీసి సూసైడ్‌గా చిత్రీకరించింది. పోస్టుమార్టం నివేదికలో నిజం తేలడంతో వారిని అరెస్ట్ చేశారు.