News January 14, 2026

సంగారెడ్డి: త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు ఇస్తాం: మంత్రి

image

తెలంగాణను ఆరోగ్య రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు వెళ్తోందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మంగళవారం ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు ఎంపికైన 1257 మందికి నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆరోగ్య శాఖలో గత రెండేళ్లలో 9,572 ఉద్యోగాలు భర్తీ చేశామని, త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు ఇస్తామన్నారు.

Similar News

News January 25, 2026

NTR: కార్ గిఫ్ట్ అంటూ మోసం.. డబ్బులు మాయం!

image

ఈ-కామర్స్ సంస్థల పేరుతో వస్తున్న నకిలీ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ‘మీషో’లో కారు గెలుచుకున్నారని నమ్మించి కృష్ణలంకకు చెందిన యువకుడి నుంచి సైబర్ నేరగాళ్లు విడతల వారీగా నగదు వసూలు చేశారు. మరో ఘటనలో గుర్తుతెలియని ఏపీకే (APK) ఫైల్ లింక్ ఓపెన్ చేయడంతో ఓ వ్యక్తి ఖాతా నుంచి రూ.1.80 లక్షలు మాయమయ్యాయి. బహుమతుల ఆశ చూపే లింకులను క్లిక్ చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

News January 25, 2026

వరంగల్: కేరళలో నెక్కొండ యువతి అనుమానాస్పద మృతి

image

వరంగల్ జిల్లా నెక్కొండ మండలం సూరిపెల్లికి చెందిన శ్వేత అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని కేరళలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రెండేళ్ల క్రితం ఆమెకు జంగాల విక్రమ్ అనే వ్యక్తితో వివాహం కాగా, ప్రస్తుతం కేరళలో CRPFగా విధులు నిర్వహిస్తున్నారు. భర్తతో కలిసి అక్కడే ఉంటున్న శ్వేత మృతి చెందగా సూరిపెల్లిలో విషాదఛాయలు అలముకున్నాయి. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

News January 25, 2026

రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ

image

AICC అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన రేపు ఢిల్లీలో PCCల సమావేశం జరగనుంది. ఈ భేటీకి రాహుల్ గాంధీ హాజరయ్యే అవకాశం ఉంది. కేంద్రం MGNREGAను జీ రామ్ జీ బిల్లుగా మార్చిన అంశంపై దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టే దిశగా చర్చించనున్నారు. అలాగే రాబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై వ్యూహాలతో పాటు ఈనెల 28 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరిపై సమాలోచనలు జరగనున్నాయి.