News January 14, 2026

ఎమ్మెల్యే పీఎస్ఆర్‌కు డిప్యూటీ సీఎం లేఖ

image

రాష్ట్రంలో విద్యుత్ పరంగా ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలలో భాగస్వాములు కావాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క కోరారు. ఈ మేరకు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు పంపిన లేఖను స్థానిక విద్యుత్ శాఖ అధికారులు మంగళవారం అందజేశారు. విద్యుత్ శాఖ సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, త్వరలో జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్షలు, సమావేశాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

Similar News

News February 5, 2026

కృష్ణా: సికింద్రాబాద్ వెళ్లే ప్రయాణికులకు GOOD NEWS

image

ప్రయాణికుల రద్దీ మేర ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా అనకాపల్లి(AKP)- సికింద్రాబాద్(SC) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు బుధవారం తెలిపారు. నం.07041 SC- AKP రైలు ఈ నెల 22న, నం.07042 AKP- SC రైలు 23న నడుపుతున్నామన్నారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ AC, స్లీపర్, జనరల్ కోచ్‌లతో నడిచే ఈ రైళ్లు ఉమ్మడి కృష్ణాలో విజయవాడ, గుడివాడ, కైకలూరులో ఆగుతాయని వెల్లడించారు.

News February 5, 2026

ఫిబ్రవరి 5: చరిత్రలో ఈరోజు

image

✒1884: హైదరాబాద్ 6వ నిజాం మహబూబ్ అలీ ఖాన్ పట్టాభిషేకం
✒1915: ఆంధ్ర ప్రజా నాట్యమండలి వ్యవస్థాపకుడు గరికపాటి రాజారావు జననం
✒1920: బుర్రకథ పితామహుడు షేక్ నాజర్ జననం
✒1976: బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ జననం
✒1988: ప్రముఖ కవి బెళ్లూరి శ్రీనివాసమూర్తి మరణం
✒1990: క్రికెటర్ భువనేశ్వర్ కుమార్(ఫొటోలో) జననం

News February 5, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.