News January 14, 2026
భద్రాద్రి జిల్లాలో 1,85,348 మంది ఓటర్లు

భద్రాద్రి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో అధికారులు ఓటర్ల తుది జాబితాను విడుదల చేశారు. మొత్తం 1,85,348 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో అత్యధికంగా కొత్తగూడెంలో 1,34,775 మంది ఓటర్లు ఉండగా, అత్యంత తక్కువగా అశ్వారావుపేటలో 16,850 మంది ఉన్నారు. ఇల్లందులో 33,723 ఓటర్లతో మున్సిపల్ బరి సిద్ధమైంది. ఓటర్ల జాబితా ఖరారు కావడంతో రాజకీయ సందడి మొదలైంది.
Similar News
News January 29, 2026
ఓ పక్క కానిస్టేబుల్ ట్రైనింగ్.. మరోపక్క గ్రూప్స్-2 ఉద్యోగం

తాడిపత్రిలోని నందలపాడుకు చెందిన ఇల్లూరు ప్రవీణ్ కుమార్ గ్రూప్-2 ఉద్యోగం సాధించాడు. ప్రవీణ్ కుమార్ ఎక్కడా కోచింగ్‌కు వెళ్లకుండా సొంతగా గ్రూప్స్‌కు ప్రిపేర్ అయ్యారు. కాగా, మొన్న విడుదల చేసిన కానిస్టేబుల్ ఫలితాలలో పోస్టు సాధించి ప్రస్తుతం కడపలో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే గ్రూప్స్-2లో పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం సాధించాడు.
News January 29, 2026
సంగారెడ్డి: ‘క్యాన్సర్ పై అవగాహన కల్పించడమే లక్ష్యం’

గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు వచ్చే రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తించి ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసిందని సెర్ఫ్ సీఈఓ దివ్య దేవరాజన్ అన్నారు. సంగారెడ్డిలోని ఎస్ఎస్ గార్డెన్లో అవగాహన సమావేశం బుధవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. క్యాన్సర్‌పై ఉన్న భయాలు, అపోహలను తొలగించి మహిళల్లో ధైర్యం నింపడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
News January 29, 2026
RO-KO కోసం రూల్స్ మారనున్నాయ్!

విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్, కోహ్లీ ఆడిన మ్యాచులు ప్రసారం కాకపోవడంపై విమర్శలు వచ్చాయి. అవి లైవ్ టెలికాస్ట్ కాకపోవడానికి కారణం 100 దేశవాళీ మ్యాచులు మాత్రమే లైవ్ చేసేలా టెలివిజన్ సంస్థతో BCCIకి ఒప్పందం ఉంది. ఇప్పుడు దాన్నే మార్చనున్నట్లు, 100కు మించి మ్యాచులు ప్రసారం చేసేలా చర్యలు తీసుకోనున్నట్లు BCCI కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు. స్టార్ ప్లేయర్స్ ఆడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోనున్నారు.


