News January 14, 2026

ఆస్టియోపోరోసిస్‌ ముప్పు వారికే ఎక్కువ

image

మెనోపాజ్‌దశలో ఆడవాళ్లలో ఆస్టియోపోరోసిస్ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అయితే సంతాన సంబంధిత సమస్యలు ఉన్నవారిలో ఈ రిస్క్‌ మరింత ఎక్కువని ఫెర్టిలిటీ అండ్‌ స్టెరిలిటీ జర్నల్‌లోని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. గతంలో సంతాన లేమి, గర్భస్రావం, మృత శిశువు జన్మించటం వంటివి జరిగిన మహిళల్లో ఆస్టియోపోరోసిస్‌ ముప్పు 16శాతం అధికంగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. వీరు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Similar News

News February 4, 2026

రబీ జొన్నలో కలుపు నివారణకు సూచనలు

image

జొన్న విత్తిన 30-35 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. విత్తిన 48 గంటలలోపు ఎకరాకు 800 గ్రా. అట్రజిన్‌ (50%) పొడి మందును 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై సమంగా పిచికారీ చేస్తే 35 రోజుల వరకు కలుపు సమస్య ఉండదు. విత్తిన 30, 60 రోజులకు గుంటక లేదా దంతితో వరుసల మధ్య అంతర కృషి చేసుకోవాలి. దీని వలన కలుపు నివారణతో పాటు తేమ నిలిచి పంట చివరి దశలో బెట్టకు గురికాకుండా ఉంటుంది.

News February 4, 2026

SBIలో 2,273 ఉద్యోగాలు

image

SBIలో 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు 21-30 ఏళ్ల వయసున్న వారు అర్హులు. రిజర్వేషన్ ఉన్న వారికి వయసులో సడలింపు ఉంటుంది. స్థానిక భాష చదవడం, రాయడం వచ్చి ఉండాలి. అభ్యర్థులు FEB 18 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: sbi.bank.in

News February 4, 2026

ఇండియన్ బ్యాంక్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

<>ఇండియన్ <<>>బ్యాంక్, చెన్నై స్పోర్ట్స్ కోటాలో 7 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గలవారు నేటి నుంచి FEB 24వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ అర్హతతో పాటు అంతర్జాతీయ, జాతీయ, యూనివర్సిటీ, ఖేలో ఇండియా స్థాయిలో క్రీడల్లో పాల్గొన్నవారు అర్హులు. వయసు 18 – 26ఏళ్ల మధ్య ఉండాలి (రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు). స్క్రీనింగ్ అప్లికేషన్స్ /ట్రయల్స్/ఇంటర్వ్యూ/మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.