News January 14, 2026

భూపాలపల్లి: విద్యుత్ తీగల వద్ద గాలిపటాలు ఎగురవేయొద్దు!

image

విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్న ప్రాంతాల్లో గాలిపటాలు ఎగురవేయవద్దని భూపాలపల్లి జిల్లా విద్యుత్ శాఖ అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా చైనా మాంజా వాడకం ప్రమాదకరమని, కాటన్ దారం మాత్రమే వాడాలని సూచించారు. పిల్లల భద్రత దృష్ట్యా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి, విద్యుత్ తీగలు లేని ఖాళీ ప్రదేశాల్లోనే గాలిపటాలు ఎగిరేలా చూడాలన్నారు. ప్రజలందరూ సురక్షితంగా సంక్రాంతి జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు.

Similar News

News February 10, 2026

HYD: గాజులరామారంలో కంపించిన భూమి

image

గాజులరామారంలోని మెట్‌ఖాన్‌గూడలో ఉ.10:10గంటలకు ఒక్కసారి పెద్దగా భూమి కంపించినట్లు శబ్దం వచ్చిందని స్థానికులు తెలిపారు. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ జనం భయబ్రాంతులతో ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. పలు గేటెడ్ కమ్యూనిటీలోని అపార్ట్‌మెంట్‌వాసులు, స్థానికులు రోడ్డుపైకి వచ్చి గూమిగూడారు. ఇది భూకంపమా లేక ఇతర పేలుడు పదార్థాలు వచ్చిన శబ్దమా అని వారు ఆందోళన చెందుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.

News February 10, 2026

వేములవాడ: పోలింగ్‌కు ‘సామగ్రి’ సిద్ధం

image

వేములవాడ పురపాలక సంఘంలో ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ప్రారంభమైంది. 28 వార్డుల్లో 58 పోలింగ్ కేంద్రాలలో 10 మంది రిటర్నింగ్ అధికారులు, 10 మంది ఏఆర్‌వోలు, 58 మంది పీవోలు, 232 మంది ఓపీవోలు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. వేములవాడ ఆర్డీవో రాధాబాయి, జిల్లా ఎన్నికల సహాయ అధికారి కే.సంపత్ కుమార్ పర్యవేక్షణలో అధికారులు విధుల్లో పాల్గొంటున్నారు.

News February 10, 2026

ఎంజీఎం ల్యాబ్‌లో నిలిచిన సీరం ఎలక్ట్రోలైట్స్ పరీక్షలు

image

ఎంజీఎం ఆస్పత్రిలోని సెంట్రల్ ల్యాబ్‌లో సీరం ఎలక్ట్రోలైట్స్ పరీక్షలు జరగడం లేదు. కెమికల్ కొరత కారణంగా పరీక్షలు జరగడం లేదని సిబ్బంది తెలిపారు. ఎంజీఎం ఆసుపత్రికి వచ్చే వారిలో ఎక్కువగా అత్యవసర రోగులే ఉంటారు. చికిత్సకు ముందు సీరం ఎలక్ట్రోలైట్స్ పరీక్ష చేయించుకోవాలని వైద్యులు సూచిస్తారు. ఈ పరీక్ష ఆస్పత్రిలో లేక ప్రైవేటుకు వెళ్లాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు. పరీక్షలు ఇక్కడే జరిగేలా చూడాలన్నారు.