News January 14, 2026
స్విమ్మింగ్ ఫూల్ పనులు వేగవంతం చేయండి: కలెక్టర్

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఈత కొలను(స్విమ్మింగ్ పూల్) మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ పి.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో క్రీడా సదుపాయాలపై నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. మరమ్మతులు ముగించి, నైపుణ్యం గల సిబ్బందిని నియమించాలని సూచించారు. ఈత కొలనును ఏడాది పొడవునా వినియోగంలో ఉండేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.
Similar News
News January 25, 2026
అల్లూరిలో చికెన్ ధరలు ఇలా

అల్లూరి, పోలవరం జిల్లాల్లో ఆదివారం బ్రాయిలర్ చికెన్ కిలో రూ. 300-360లగా విక్రయిస్తున్నారు. రాజవొమ్మంగి, చింతపల్లి, పాడేరు, రంపచోడవరం, మారేడుమిల్లి, చింతూరు తదితర ప్రాంతాల్లో ఈ రేటుకు విక్రయిస్తున్నట్లు వినియోగదారులు తెలిపారు. మేక మాంసం రూ. 800, చేపలు రూ.200-250వరకు విక్రయిస్తున్నారు.
News January 25, 2026
ఛీటింగ్ ఆరోపణలు.. రూ.10 కోట్ల దావా వేసిన పలాష్ ముచ్చల్

₹40 లక్షలు తీసుకుని మోసం చేశాడని, అమ్మాయితో మంచంపై <<18940645>>అడ్డంగా దొరికాడని<<>> తనపై వస్తున్న ఆరోపణలపై పలాష్ ముచ్చల్ కోర్టుకెక్కారు. ₹10 కోట్ల పరువు నష్టం దావా దాఖలు చేశారు. తనపై వస్తున్న ఆరోపణలు అబద్ధాలని స్పష్టం చేశారు. ‘నా పరువు, వ్యక్తిత్వాన్ని కించపరచాలనే ఉద్దేశంతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నా లాయర్ ద్వారా విజ్ఞాన్ మానేకు లీగల్ నోటీసు పంపాను’ అని ఇన్‌స్టాలో రాసుకొచ్చారు.
News January 25, 2026
NZB: నేడు జిల్లాకు మంత్రులు, TPCC చీఫ్ రాక

రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి, ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆదివారం నిజామాబాద్ జిల్లా పర్యటనకు రానున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీతో కలిసి NZBలో మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 గంటల వరకు కార్పొరేషన్ పరిధిలోని కాంగ్రెస్ శ్రేణులతో సమావేశమై దిశా నిర్దేశం చేస్తారు. అనంతరం ఆర్మూర్ వెళ్లి అక్కడ సమావేశం నిర్వహిస్తారు.


