News January 14, 2026

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోనే బాగా నటిస్తున్నారు: కేతిరెడ్డి

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాల కంటే రాజకీయాల్లోనే బాగా నటిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఎద్దేవా చేశారు. తమ సిద్ధాంతం ఒంటరి పోరాటమని, ఒంటరిగానే గెలుస్తామని స్పష్టం చేశారు. ధర్మవరం మున్సిపాలిటీలో సున్నపు పొడి కనిపిస్తే సత్యకుమార్ వస్తున్నారని అర్థమన్నారు. ఆయనను సత్యకుమార్ అనడం కంటే పీపీపీ మంత్రి అనడమే కరెక్ట్ అని కేతిరెడ్డి వ్యాఖ్యానించారు.

Similar News

News February 15, 2026

రేపు ప్రజావాణి రద్దు: నిర్మల్ కలెక్టర్

image

నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల దృష్ట్యా ఈ వారం ప్రజావాణిని రద్దు చేశామన్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

News February 15, 2026

రాజన్న సన్నిధిలో క్షేత్రస్థాయిలో కలెక్టర్‌ పర్యవేక్షణ

image

మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ పట్టణంలోని భీమేశ్వరాలయం భక్తులతో రద్దీగా మారింది. ఈ మేరకు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదివారం క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూ లైన్ కౌంటర్లను పరిశీలించి, ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని భక్తులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు శీఘ్రంగా దర్శనమయ్యేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు.

News February 15, 2026

ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలకు ముప్పు.. PTI ఆందోళన

image

అవినీతి కేసుల్లో జైలులో ఉన్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ <<19124142>>తీవ్ర అనారోగ్యంతో<<>> బాధపడుతున్నట్లు PTI పార్టీ తెలిపింది. దీంతో అధికారులు ఆయనను జైలు నుంచి రహస్యంగా ఆస్పత్రికి తరలిస్తున్నారని, ఇది ఇమ్రాన్ ప్రాణాలకు ముప్పు కలిగిస్తుందని ఆరోపించింది. ఆయన ఫ్యామిలీ మెంబర్, పర్సనల్ డాక్టర్ల సమక్షంలో పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేసింది. ఇమ్రాన్ ఆరోగ్యం గురించి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని కోరింది.