News January 14, 2026
పండగ పూట.. హసన్‌పర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం

హనుమకొండ జిల్లా హసన్‌పర్తి వద్ద హైవే పనులు చేస్తున్న టిప్పర్ ఢీకొనడంతో కేశవాపూర్‌కు చెందిన పాల వ్యాపారి ఈర కుశుడు (38) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహం గుర్తు పట్టలేని విధంగా నుజ్జునుజ్జైంది. కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం విషాదంగా మారింది. కుశుడికి భార్య స్నేహ, పిల్లలు ఉన్నారు.
Similar News
News February 23, 2026
పుష్కరాల కోసం పటిష్ఠ ఏర్పాట్లు: కలెక్టర్

రానున్న గోదావరి పుష్కరాలకు పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. సోమవారం దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ నిర్వహించిన వీసీలో ఆమె మాట్లాడారు. బాసరలో భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు. భక్తులకు ఇబ్బందుల్లేకుండా పుష్కర ఘాట్లు, తాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్ వసతులు కల్పిస్తామన్నారు. వీసీలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
News February 23, 2026
ఇంటర్ పరీక్షలపై పెద్దపల్లి కలెక్టర్ సమీక్ష

ఈనెల 25 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్షలు జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన సమీకృత కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లు అరుణశ్రీ, వేణుతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. మొత్తం 22 కేంద్రాలలో 10367 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రం వద్ద ప్రతి విద్యార్థినీ క్షుణ్ణంగా చెక్ చేయాలని సూచించారు.
News February 23, 2026
రేపు ఆదిలాబాద్‌లో కేటీఆర్ పర్యటన

ఈనెల 24న మంగళవారం ఆదిలాబాద్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటిస్తున్నట్లు మాజీ మంత్రి జోగురామన్న తెలిపారు. ఉదయం 11 గంటలకు జిల్లా కేంద్రానికి చేరుకుంటారన్నారు. పర్యటనలో భాగంగా జిల్లా జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో పాటు బీఆర్ఎస్ నాయకులను పరామర్శించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కేటీఆర్ పర్యటన విజయవంతం చేయాలని కోరారు.


