News January 14, 2026

ములుగు: ఎర్రటి స్తూపం పచ్చగా మారింది!

image

ఒకప్పుడు విప్లవోద్యమంలో అమరులైన వారికి గుర్తుగా ఎర్రటి స్తూపాలను ఏర్పాటు చేశారు. పోలీసు నిర్బంధం సమయంలో అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ స్తూపం వద్ద నివాళులర్పించేవాళ్లు. కాలక్రమంగా నక్సల్స్ అంతరించే దశకు చేరడంతో స్తూపాల దగ్గర స్తబ్ధత నెలకొంది. మేడారం జాతర సందర్భంగా కన్నెపల్లిలోని ఎర్రటి స్తూపాన్ని ఆదివాసీ అమరవీరులకు గుర్తుగా మార్చారు. వారి త్యాగాలకు సంకేతంగా ఆకుపచ్చని రంగులో స్తూపాన్ని మార్చారు.

Similar News

News February 15, 2026

రైతుభరోసా ఒకే విడతలో.. ?

image

TG: గతంలో మాదిరి కాకుండా ఈసారి ప్రభుత్వం ఒకే విడతలో రైతుభరోసా నిధులను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఎకరాల చొప్పున డబ్బులు విడుదల చేయడంతో మొత్తం ప్రక్రియ పూర్తయ్యేసరికి 9 రోజుల సమయం పట్టేది. ఈసారి పెట్టుబడికి రైతులు ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా ఒకే విడతలో ఖాతాల్లో డిపాజిట్ చేయనున్నట్లు సమాచారం. కాగా ఈ నెల 17న రైతుభరోసా నిధులు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

News February 15, 2026

కాంగ్రెస్‌లో చేరిన ఐదుగురు కొత్తగూడెం స్వతంత్ర కార్పొరేటర్లు

image

కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా విజయం సాధించిన ఐదుగురు కార్పొరేటర్లు ఆదివారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో వీరు కాంగ్రెస్‌లో చేరగా, వారికి మంత్రి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో 1, 13, 34, 42, 48వ డివిజన్ల కార్పొరేటర్లు సుగుణ, తలుగు శాంత, విజయలక్ష్మి, మణి, నరేష్ ఉన్నారు.

News February 15, 2026

పాకిస్థాన్‌కు ‘ధురంధర్’ డోస్!

image

T20 WCలో ఇవాళ కొలంబో వేదికగా జరగనున్న IND, PAK మ్యాచుకు ముందు మ్యూజికల్ ప్రోగ్రామ్ నిర్వహించనున్నారని జాతీయ క్రీడా వర్గాలు తెలిపాయి. ఇందులో ‘ధురంధర్’ సినిమా పాటల్ని ప్లే చేస్తారని, ర్యాపర్ హనుమాన్‌కైండ్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారని పేర్కొన్నాయి. పాక్‌, గల్ఫ్ దేశాల్లో ఈ సినిమాపై బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే. కానీ ఈరోజు ఆ టీమ్‌తో పాటు PCB ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీకి ‘ధురంధర్’ డోస్ తప్పేలా లేదు.